హీరోల వయసుతో పని లేదు.. అందరితో ఆ పని చేయడానికి రెడీ: శ్రీలీల కామెంట్స్ వైరల్

by Hamsa |   ( Updated:2023-06-03 10:11:02.0  )
హీరోల వయసుతో పని లేదు.. అందరితో ఆ పని చేయడానికి రెడీ: శ్రీలీల కామెంట్స్ వైరల్
X

దిశ, వెబ్ డెస్క్: ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో వరుస చిత్రాలతో దూసుకుపోతున్న హీరోయిన్ శ్రీ లీల. పెళ్లి సందడి సినిమాతో ఎంట్రీ ఇచ్చిన ఈ అమ్మడు ‘ధమాకా’ హిట్ కొట్టడంతో ఈ భామ కోసం నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో ఈ అమ్మడుకి పోటీపడి అవకాశాలు ఇస్తున్నారు. ఇప్పుడు హీరోయిన్స్‌లో శ్రీలీలకు ఉన్న అవకాశాలు మరెవరికీ లేవు. ఈ క్రమంలో కొంతమంది శ్రీలీల స్టార్ హీరోలతో నటిస్తేనే ఫేమస్ అవుతానని అనుకుంటుంది అంటూ ట్రోలింగ్ చేశారు. తాజాగా, శ్రీలీల అలా కామెంట్లు చేసిన వారికి గట్టి కౌంటర్ ఇచ్చింది. ‘‘ కొత్త హీరోలు.. పాత హీరోలు అని తేడా లేదు. వాళ్ల వయసుతో సంబంధం లేదు అందరితో కలసి నటించే అవకాశం ప్రతి ఒక్కరికీ వస్తుంది. ఈ రోజుల్లో స్టార్ హీరో పక్కన నటిస్తేనే ఫేమస్ అని అనుకోవద్దు. ఏ హీరోతో నటించినా సినిమా బాగుంటే ప్రేక్షకులు థియేటర్లకు పరుగులు తీస్తారు. కాబట్టి అలాంటి కామెంట్లు చేయడం మానుకోండి’’ అంటూ ఘాటుగా రిప్లై ఇచ్చింది.

Read Mores: ఆ సీక్రేట్ బయటపెట్టిన రకుల్.. హీరోయిన్ కాకపోతే ఆ పని చేసేదంట

Advertisement

Next Story