- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆ సినిమా రిలీజ్ తర్వాత కొందరు అమ్మాయిలు ఇంట్లోంచి పారిపోయారు.. అమల కామెంట్స్ వైరల్
దిశ, వెబ్ డెస్క్: టాలీవుడ్ సీనియర్ హీరోయిన్ అమల అనేక చిత్రాల్లో నటించి స్టార్ హీరోయిన్‌గా రాణించింది. ప్రస్తుతం తల్లి పాత్రలు పోషిస్తూ ప్రేక్షకులను అలరిస్తోంది. తాజాగా, ఆమె ఓ ఇంటర్వ్యూలో పాల్గొని తన చిత్రాల గురించి ఆసక్తికర విషయాలు తెలిపింది. అమల మాట్లాడుతూ.. ‘‘మలయాళం చిత్ర పరిశ్రమ అనగానే నాకు బాగా గుర్తుకు వచ్చేది ‘Ente Sooryaputhrikku’. 1991లో ఇది విడుదలైంది. ఇందులో నా పాత్ర రెబల్‌గా ఉంటుంది. ఆ సినిమా రిలీజ్ అయ్యాక.. కేరళకు చెందిన పలువురు అమ్మాయిలు తమ ఇళ్ల నుంచి పారిపోయి చెన్నైలోని మా ఇంటికి వచ్చారు. నా రోల్ తమకెంతో నచ్చిందని.. తమలో స్ఫూర్తి నింపిందని చెప్పారు. అలా, మొదటిసారి స్టార్‌డమ్ చూశా. నా పాత్ర వాళ్లను ఏ విధంగా ప్రేరేపితం చేసిందో తెలుసుకుని సంతోషించా. వాళ్లతో మాట్లాడి.. తిరిగి వాళ్లను క్షేమంగా ఇంటికి వెళ్లిపొమ్మని చెప్పా. నా మేనేజర్‌ను వాళ్లకు తోడుగా పంపించానని అన్నారు. అనంతరం ఆమె.. కమల్‌హాసన్‌తో వర్క్ చేయడం వల్ల నటన గురించి ఎన్నో విషయాలు తెలుసుకున్నా. రజనీకాంత్‌తో నటించిన ‘Velaikkaran’ చిత్రంలోని ఓ పాటను మంచులో షూట్ చేశారు.. దాని వల్ల తన కాళ్లు వాచిపోయి, నడవడానికి కూడా కష్టపడ్డాను ’’అంటూ చెప్పుకొచ్చింది. ప్రస్తుతం అమల చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.
Read More: హై..హై నాయక.. హొయ్.. హొయ్ నాయక..: విశ్వనట చక్రవర్తి ఎస్.వీ రంగారావు యాదిలో...