Adivi Sesh: క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన అడివి శేష్

by sudharani |
Adivi Sesh: క్యాన్సర్‌తో పోరాడుతున్న పాపకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చిన అడివి శేష్
X

దిశ, సినిమా: టాలీవుడ్ యంగ్ హీరో అడివి శేష్.. క్యాన్సర్‌తో పోరాడుతున్న ఓ చిన్ని పాపకు బిగ్ సర్ప్రైజ్ ఇచ్చాడు. అయితే.. శేష్‌కి డై -హార్డ్ ఫ్యాన్ అయిన ఆ చిన్నారి తన అభిమాన హీరో(శేష్)ని కలవాలని చాలా కాలంగా అనుకుంది. ఆమె పరిస్థితి తెలుసుకున్న హీరో వెంటనే ఇండస్ట్రీకి చెందిన ఒక సన్నిహిత వ్యక్తి ద్వారా ఆ చిన్నారి కుటుంబ సభ్యులని సంప్రదించాడు. వీడియో కాల్స్ ద్వారా కనెక్ట్ అయ్యారు. చిన్నారి మెసేజులకు రిప్లేయ్ ఇచ్చారు. ఇక ఆ పాప కోసం ఒక క్యూట్ సర్ ప్రైజ్ ప్లాన్ చేసిన హీరో.. ఒక హోటల్‌లో ఫ్యామిలీ కోసం డే అవుట్‌ని ఏర్పాటు చేసి చిన్నారిని కలిసి సర్ప్రైజ్ చేశారు. పాపతో రోజంతా సరదాగా ఆడుతూ గడిపారు. అలాగే అవసరమైనప్పుడు తన సపోర్ట్ ఉంటుందని చెప్పారు. కన్సల్టేషన్ కోసం హైదరాబాద్‌కు వచ్చినప్పుడు వారిని మళ్లీ కలుసుకున్నారు. ప్రజెంట్ ఇందుకు సంబంధించిన ఫొటోస్ నెట్టింట వైరల్ అవుతున్నాయి.

Advertisement

Next Story

Most Viewed