ఎల్లో డ్రెస్‌లో అదితి రావు హైదరి స్టన్నింగ్ లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా

by Hamsa |   ( Updated:2024-02-02 08:42:31.0  )
ఎల్లో డ్రెస్‌లో అదితి రావు హైదరి స్టన్నింగ్ లుక్స్.. ఫ్యాన్స్ ఫిదా
X

దిశ, సినిమా: యంగ్ బ్యూటీ అదితి రావు హైదరి తెలుగు ప్రేక్షకులకు పరిచయం అక్కర్లేదు. తెలుగులో చెలియా, సమ్మోమనం, అంతరిక్షం, సైకో, హే సినామిక, వి, మహా సముద్రం వంటి చిత్రాల్లో నటించి మెప్పించింది. అలాగే తమిళంలో ఎన్నో హిట్ సినిమాలతో ఫుల్ పాపులారిటీ సంపాదించుకుంది. ప్రస్తుతం పలు చిత్రాల్లో నటిస్తుంది. సోషల్ మీడియాలోనూ అదితి యాక్టీవ్‌గా ఉంటూ పలు హాట్ ఫొటోస్ షేర్ చేస్తుంది. తాజాగా, ఎల్లో కలర్ షరారా సెట్‌లో అందరినీ మైమరిపించింది.

మత్తెక్కించే చూపులతో కుర్రకారును ఫిదా చేసింది. అయితే ఈ డ్రెస్ ఖరీదు ఏకంగా రూ. 95,000 వేలు అని సమాచారం. ఇక ఈ విషయం తెలిసిన నెటిజన్లు షాక్ అవుతున్నారు. ప్రస్తుతం అదితి ఫొటోలు నెట్టింట హల్ చల్ చేస్తున్నాయి. అవి చూసిన నెటిజన్లు బ్యూటీఫుల్, గార్జీయస్, సూపర్ అంటూ కామెంట్లు పెడుతున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు టాలీవుడ్ హీరో సిద్దార్థ్‌తో గత కొద్ది కాలంగా రిలేషన్‌లో ఉన్నట్లు వార్తలు వైరల్ అవుతున్న విషయం తెలిసిందే. దీనిపై వీరిద్దరు స్పందిచకపోవడంతో రూమర్స్ నెట్టింట షికార్లు చేస్తున్నాయి. అలాగే ఇటీవల సిద్దార్థ్, అదితి రీల్స్ చేస్తూ సోషల్ మీడియాలో సందడి చేస్తున్నారు. ఇక వాటిని చూసిన వారంతా వీరిద్దరు నిజంగానే ప్రేమలో ఉన్నట్లు ఫిక్స్ అయిపోయారు. దీనిపై ఎవరో ఒకరు అధికారికంగా స్పందిస్తే తప్ప వీరి రిలేషన్‌పై క్లారిటీ రాదు.

Advertisement

Next Story