Adipurush : అట్టర్ ప్లాప్ టాక్.. అయినా వసూళ్లలో రికార్డులు బద్దలు కొడుతున్న ‘ఆదిపురుష్’

by sudharani |   ( Updated:2023-06-27 08:23:27.0  )
Adipurush : అట్టర్ ప్లాప్ టాక్.. అయినా వసూళ్లలో రికార్డులు బద్దలు కొడుతున్న ‘ఆదిపురుష్’
X

దిశ, వెబ్‌డెస్క్: పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా.. దర్శకుడు ఓం రౌత్ కాంబోలో తెరకెక్కిన సినిమా ‘ఆదిపురుష్’. రామాయణం బ్యాక్ డ్రాప్‌లో రూపొందిన ఈ మూవీ.. ఈ నెల 16న రిలీజై అనేక వివాదాలు ఎదుర్కొంది. ఓం రౌత్ తనదైన పైత్యంతో రామాయణాన్ని పూర్తిగా వక్రీకరించి ఈ సినిమా తీశాడంటూ రామభక్తులతో సైతం కామన్ ఆడియన్స్ కూడా డైరెక్టర్‌పై విరుచుకుపడ్డారు. అయితే.. ఓ పక్క విమర్శలు ఎదుర్కొంటూనే థియేటర్లలో దూసుకుపోతుంది ఈ సినిమా. ప్రపంచ వ్యాప్తంగా భారీ ఎత్తున విడుదలైన ఈ మూవీ.. విమర్శలు ఎదుర్కొంటున్నప్పటికీ బాక్సాఫీస్ వద్ద కలెక్షన్లు రాబట్టడంలో ఏ మాత్రం తగ్గడం లేదని టాక్ వినిపిస్తోంది.

మొదటి మూడు రోజులు టాక్‌తో సంబంధం లేకుండా భారీగా కలెక్షన్లు రాబట్టిన ఆదిపురుష్.. ఆ తర్వాత కాస్త స్లో అయింది. కానీ.. ఓవరల్‌గా ఈ సినిమా రూ.450 కోట్లు వసూలు చేసినట్లు చిత్ర బృందం అధికారికంగా ప్రకటించింది. ఈ మేరకు రిలీజ్ చేసిన పోస్టర్ వైరల్ అవుతోంది. దీంతో ప్రభాస్ ఓ అరుదైన రికార్డ్ క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. బాహుబలి, బాహుబలి 2, సాహో తర్వాత అమెరికాలో తాజాగా ఆదిపురుష్ 3 మిలియన్ డాలర్ల మార్కును దాటింది. ఈ రికార్డ్ తెలుగులో మరే ఇతర టాలీవుడ్ హీరోకు లేదని సమాచారం. కాగా.. ప్రపంచ వ్యాప్తంగా ఆదిపురుష్ సినిమా 7 వేలకు పైగా స్క్రీన్స్‌లో విడుదలైన విషయం తెలిసిందే.

Also Read..

రావణాసురుడిపై Jr. NTR షాకింగ్ కామెంట్స్.. చూసి బుద్ధి తెచ్చుకో అంటూ ఆదిపురుష్ డైరెక్టర్‌పై ఫైర్

Pawan Kalyan : వల్ల నా కెరీర్ నాశనమైంది: పోసాని సంచలన వ్యాఖ్యలు

Advertisement

Next Story