- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
Adipurush box office collection Day 1 :వివాదాలను ఎదుర్కొంటూనే ఫస్ట్ డే కలెక్షన్స్ ఎన్ని కోట్లు రాబట్టిందంటే?
దిశ, వెబ్ డెస్క్: యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ హీరోగా నటించిన బాహుబలి సినిమా ప్రపంచవ్యాప్తంగా సూపర్ హిట్‌గా నిలిచి రికార్డ్ సృష్టించిన సంగతి తెలిసిందే. కానీ ఆ తర్వాత వచ్చిన సాహో, రాధే శ్యామ్ యావరేజ్‌గా నిలిచాయి. దీంతో డార్లింగ్ ఆశలన్నీ ఆదిపురుష్ సినిమాపై పెట్టుకున్నాడు. రామాయణం ఆధారంగా తెరకెక్కడంతో ఫ్యాన్స్‌కు కూడా సినిమాపై భారీ అంచనాలు పెరిగిపోయాయి. ఈ మూవీకి ఓం రౌత్ దర్శకత్వం వహించగా.. హీరోయిన్గా బాలీవుడ్ బ్యూటీ కృతి సనన్ నటించింది. అయితే జూన్ 16న ప్రపంచ వ్యాప్తంగా అన్ని భాషల్లో ఆదిపురుష్ రిలీజ్ అయి మిక్స్డ్ టాక్‌ను సొంతం చేసుకుంది. మిక్స్డ్ టాక్ వచ్చినప్పటికి ఆదిపురుష్ ఫస్ట్ డే కలెక్షన్స్ భారీగా రాబట్టినట్లు తెలుస్తోంది.
మొత్తానికి తొలిరోజు ప్రపంచవ్యాప్తంగా ఆదిపురుష్ రూ. 137 కోట్లను రాబట్టింది. ఏపీ, తెలంగాణ రాష్ట్రాల్లో తొలిరోజు 69 కోట్లు రాబట్టింది. నైజాంలో 18.02 కోట్లు, ఉభయ గోదావరి జిల్లాల్లో 10.01 కోట్లు, గుంటూరు 5.10 కోట్లు, విజయవాడలో 5.01 కోట్లు కలెక్ట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా గ్రాస్ కలెక్షన్స్ రూ. 150 కోట్ల మార్క్‌ను అందుకున్నట్లు తెలుస్తోంది. వరల్డ్ వైడ్ షేర్ రూ. 72 కోట్లను రాబట్టిందని సమాచారం. ఇండియాతో పాటు యూఎస్‌లోనూ ఆదిపురుష్ సత్తా చాటింది. మొదటి రోజు 1 మిలియన్ ప్లస్ యూఎస్ డాలర్లు గ్రాస్ కలెక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేసింది. హిందీలో పఠాన్ తర్వాత అత్యధిక వసూళ్లు రాబట్టిన చిత్రంలో ఆదిపురుష్ నిలిచింది. దీంతో ఫ్యాన్స్ ఖుషీ అవుతున్నారు.
Read More: ఆదిపురుష్ మూవీలో సీత పాత్రకు ముందు అనుకున్న హీరోయిన్ ఎవరో తెలుసా?
#Adipurush smashes all the records!! Collects 1 Million + USD Day on First Day! 🙏🏹#Prabhas @omraut #SaifAliKhan @kritisanon @mesunnysingh #BhushanKumar #KrishanKumar @vfxwaala @rajeshnair06 @DevdattaGNage @AjayAtulOnline @vishwaprasadtg @vivekkuchibotla @TSeries… pic.twitter.com/YlyHDgmmyk
— People Media Factory (@peoplemediafcy) June 16, 2023