- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
అదా శర్మ ‘C.D’ నుంచి ఫస్ట్ లుక్ రిలీజ్
దిశ, సినిమా: రీసెంట్‌గా ‘ది కేరళ స్టోరీ’ మూవీతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న అదా శర్మ ప్రజంట్ సరికొత్తగా సైకలాజికల్ హారర్ థ్రిల్లర్ మూవీ ‘C.D’తో రాబోతోంది. కృష్ణ దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ SSCM ప్రొడక్షన్స్ బ్యానర్‌పై తెరకెక్కుతుండగా గిరిధర్ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ క్రమంలోనే తాజాగా ఈ చిత్రం నుంచి అదా శర్మకు సంబంధించిన ఫస్ట్ లుక్ పోస్టర్ రిలీజ్ చేశారు. ఇందులో అదా శర్మ సీరియస్ లుక్‌లో కనిపిస్తుండగా తన చుట్టూ డెవిల్స్ హ్యాండ్స్ కనిపిస్తున్నాయి. మొత్తానికి సినిమాపై ఆసక్తి నెలకొనేలా ఈ ఫస్ట్ లుక్ డిజైన్ చేశారు. ఈ మూవీలో అదా శర్మతో పాటు విశ్వంత్, జబర్దస్త్ రోహిణి, భరణి శంకర్, రమణ భార్గవ్, మహేష్ విట్టా ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. అతి త్వరలోనే ఈ సినిమా రిలీజ్ డేట్ ప్రకటించనున్నారు మేకర్స్.
@adah_sharma psychological horror thriller #CD #CriminalOrDevil pic.twitter.com/zZvE9fDdXg
— Disha Telugu Newspaper (@dishatelugu) August 18, 2023
- Tags
- adah sharma