- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వివాదంలో ‘బస్తర్: ది నక్సల్ స్టోరి’.. అదా శర్మ ఎమోషనల్ పోస్ట్ వైరల్
దిశ, సినిమా: యంగ్ హీరోయిన్ అది శర్మ ఇటీవల ‘ది కేరళ స్టోరీ’ మూవీతో దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ మూవీ విడుదలకు ముందే పలు వివాదాలు ఎదుర్కొని థియేటర్స్‌కి వచ్చింది. డైరెక్టర్ సుదీప్తో సేన్ తెరకెక్కించిన ఈ మూవీ ప్రేక్షకుల్లో మంచి రెస్పాన్స్ అందుకుంది. ఇదిలా ఉంటే.. ప్రస్తుతం అదా శర్మ లీడ్ రోల్‌లో నటించిన తాజా చిత్రం ‘బస్తర్ ది నక్సల్ స్టోరీ’. ఈ సినిమా మార్చి 15న థియేటర్స్‌కు వచ్చింది. ఇందులో ఛత్తీస్‌గఢ్‌లో జరిగిన నక్సల్స్ పోరాటాన్ని కళ్లకు కట్టినట్లుగా చూపించేశారు. అయితే ఇందులో ఓ సీన్ వివాదాస్పదంగా ఉన్నాయని సమాచారం. దీంతో రిలీజ్ రోజే పలు షోలు కూడా రద్దు చేసినట్లు నెట్టింట వార్తలు వైరల్ అవుతున్నాయి. అలాగే సినిమా మొత్తానికి బ్యాన్ చేయాలని చూస్తున్నట్లు చర్చ జరుగుతుందట.
ఈ సినిమా విషయంలో అదా వర్మకు కూడా చిక్కులు తప్పవని సోషల్ మీడియాలో చర్చలు మొదలయ్యాయి. ఈ క్రమంలో తాజాగా, అదా శర్మ తన ట్విట్టర్ వేదికగా ఎమోషనల్ పోస్ట్ షేర్ చేసింది. ‘‘సినిమా విడుదలైన రోజున ఎవరైనా అవార్డు పొందగలిగితే, ఈ రోజు ప్రేక్షకుల నుండి నేను ఒక అవార్డును అందుకున్నాను. దీనిని భారత్ కీ షాన్ అని పిలుస్తారు. నేను చాలా వినయంగా భావిస్తున్నాను. పూర్తిగా పొంగిపోయాను. నా పట్ల ఇంత దయ చూపినందుకు ధన్యవాదాలు’’ అంటూ రాసుకొచ్చింది. అంతేకాకుండా ఈ అమ్మడు ఓ వీడియోను కూడా షేర్ చేసింది. ఇందులో ఆమె థియేటర్ ముందు నిల్చొని రెండు చేతులు జోడించి దండం పెడుతూ ఉండగా ఆమె చుట్టూ అభిమానులు ఏవో నినాదాలు చేస్తూ కనిపించారు.
- Tags
- adah sharma