మలయాళ నటుడు సిద్దిఖీపై నటి రేవతి సంచలన ఆరోపణలు

by Hamsa |   ( Updated:2024-08-25 14:31:35.0  )
మలయాళ నటుడు సిద్దిఖీపై నటి రేవతి సంచలన ఆరోపణలు
X

దిశ, సినిమా: మలయాళ చిత్ర పరిశ్రమలో మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలు, ఇబ్బందికర పరిస్థితులపై జస్టిస్‌ హేమ కమిటీ సిద్ధం చేసిన రిపోర్ట్‌లో ఉన్న వాస్తవాలు ఆ పరిశ్రమలో త్రీవ కలకలం రేపుతోంది. మలయాళ సినీ పరిశ్రమలోని దర్శక, నిర్మాతలపై పలువురు నటీమణులు ధైర్యంగా ముందుకు వచ్చి తమ అనుభవాలను చెబుతూ వారిపై పలు ఆరోపణలు చేస్తున్నారు. ఇందులో భాగంగా అక్కడి పరిశ్రమకు చెందిన ప్రముఖ నటుడు, నిర్మాత, మలయాళ నటీనటుల సంఘం ప్రధాన కార్యదర్శి సిద్ధిఖీపై నటి రేవతి సంపత్‌ త్రీవమైన ఆరోపణలు చేశారు. ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ ‘‘ఇంటర్‌ పూర్తి చేసిన తర్వాత అంటే అప్పుడు నా వయసు 21 ఏళ్లు ఒక సినిమాలో అవకాశం గురించి నాతో డిస్కస్‌ చేయడానికి కలవాలని సిద్ధిఖీ నా ఫేస్‌బుక్‌లో మేసేజ్‌ పంపారు.

ఆ సందేశంలో చాలా గౌరవంగా కూతురుకు ఇచ్చే మర్యాదతో పిలిచారు. దాంతో నేను కూడా ఎలాంటి ఆలోచన, భయం లేకుండా ఆయన్ని వెళ్లి కలిశాను. కానీ అక్కడికి వెళ్లిన తర్వాత పరిస్థితులు నేను అనుకున్నట్లుగా లేవు. ఆయన నాపై లైంగిక వేధింపులకు పాల్పడే ప్రయత్నం చేశాడు. ఈ చేదు అనుభవం తర్వాత మానసికంగా ఎన్నో ఇబ్బందులు ఫేస్‌ చేయాల్సి వచ్చింది. ఈ సంఘటన నా కెరీర్‌పై కూడా ప్రభావం చూపింది. ఆ పరిస్థితుల్లో ఏ వ్యవస్థా నాకు తోడ్పాటు అందించ లేదు. ఈ విషయంపై మాట్లాడానికి నాకు చాలా ఏళ్లు పట్టింది’’ అని రేవతి సంపత్‌ ఆరోపణలు చేశారు.

ఈ ఇంటర్వ్యూ వైరల్‌గా మారడంతో సిద్దిఖీ తన పదవికి రాజీనామా చేశారు. దీంతో పాటు కేరళ అగ్ర దర్శకుడు కేరళ స్టేట్‌ చలన చిత్ర అకాడమీ అధ్యక్షుడు రంజిత్‌ బాలకృష్ణన్‌పై బెంగాలీ సినీ ఆర్టిస్ట్‌ శ్రీలేఖ మరో కీలక ఆరోపణలు చేశారు. సినిమా అడిషన్‌ కోసం పిలిచి ఆయన నాతో అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపించారు. ఈమె ఆరోపణలపై స్పందించిన రంజిత్‌, ఆమెకు సినిమాల్లో అవకాశం ఇవ్వకపోవడం వల్లే తనపై ఇలాంటి నిరాధార వ్యాఖ్యలు చేస్తుందని రంజిత్‌ తెలిపారు. అయితే శ్రీలేఖ వ్యాఖ్యాలతో ఆయనపై విమర్శలు పెరగడంతో స్టేట్‌ చలన చిత్ర అకాడమీ పదవికి రాజీనామా చేశారు.

Advertisement

Next Story

Most Viewed