CM జగన్ వీడియోపై సెటైర్.. మరోసారి వివాదంలో నటి Manchu lakshmi!

by GSrikanth |   ( Updated:2022-12-15 07:13:32.0  )
CM జగన్ వీడియోపై సెటైర్.. మరోసారి వివాదంలో నటి Manchu lakshmi!
X

దిశ, డైనమిక్ బ్యూరో: ఈ మధ్య కాలంలో మంచు ఫ్యామిలీ బాగా ట్రోలింగ్‌కు గురవుతోంది. ముఖ్యంగా మంచు విష్ణు 'మా' ఎన్నికల బరిలో నిలిచినప్పటినుంచి ట్రోల్స్ మరింత ఎక్కువయ్యాయి. మంచు లక్ష్మీ, మంచు విష్ణుతో పాటు మోహన్ బాబునూ ట్రోల్ చేస్తున్నారు. తాజాగా.. మరోసారి మంచు ల‌క్ష్మీ వివాదంలో చిక్కుకున్నారు. తాను మంచిగానే ఆలోచించి పోస్టులు పెట్టినా.. చివ‌రికి అవి వివాదాస్పదంగా మారింది. ప్రస్తుతం ఏపీ సీఎం జగన్‌కు సంబంధించిన ఓ వీడియో ప్రస్తుతం నెట్టింట చక్కర్లుకొడుతుంది. ముఖ్యమంత్రుల సమావేశంలో సీఎం జగన్ కెమెరాను చూసి నవ్విన ఓ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. '3 గంటల పరీక్ష సమయంలో ప్రశ్నాపత్రం చూశాకా.. నా ముఖ చిత్రం' అంటూ క్యాప్షన్ ఇచ్చి నెటిజన్లు ఆ వీడియోను వైరల్ చేస్తు్న్నారు. ఈ వీడియో కాస్త మంచు లక్ష్మి కంట పడడంతో 'లాల్' అంటూ రీట్వీట్ చేసింది. దీంతో, వైఎస్సార్ పార్టీ నేతలు, జగన్ అభిమానులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో మంచు లక్ష్మీపై ట్రోల్స్ చేస్తు్న్నారు. మా జగన్ అన్ననే ట్రోల్ చేస్తావా.. అనవసరంగా చెరదీసాడు జగన్ అన్న మిమ్మల్ని. అలాంటి ఆయననే వెటకారం చేస్తావా అంటూ కొంత నెటిజన్లు ఫైర్ అవుతున్నారు. మరికొంత మంది వీడియోను చూసి తాము సెటైర్లు వేస్తూ నవ్వుకుంటున్నారు.

READ MORE

వెయ్యికి పైగా థియేటర్లలో రిలీజ్ అవుతున్న 'హిట్ 2'

Advertisement

Next Story

Most Viewed