బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన, నటి హేమకు భారీ ఊరట!

by Jakkula Samataha |   ( Updated:2024-06-13 02:54:05.0  )
బెంగళూరు రేవ్ పార్టీ కేసులో అరెస్టైన, నటి హేమకు భారీ ఊరట!
X

దిశ, సినిమా : క్యారెక్టర్ ఆర్టిస్ట్, సీనియర్ నటి హేమ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అమ్మ, వదిన లాంటి చాలా పాత్రల్లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది ఈమె. అయితే ఈ మధ్య బెంగుళూరులోని రేవ్ పార్టీకి ఈ బ్యూటీ అటెండ్ కావడం, పైగా తాను హాజరుకాలేదని నమ్మించే ప్రయత్నంలో ఆమె చేసిన పనులు అందరికి ఈమెపై ఓ నెగిటివ్ ఫీలింగ్‌ను క్రియేట్ చేశాయనే చెప్పాలి. ఇక హేమ, రేవ్ పార్టీకి అటెండ్ అయ్యిందని పక్కా ఆధారాలు దొరికిన తర్వాత ఆమెను పోలీసులు అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. అరెస్ట్ తర్వాత ఆమెను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్‌కు తరలించారు. ప్రస్తుతం ఈ నటి పరప్ప అగ్రహార జైలులో ఉన్నట్లు సమాచారం.

ఈ క్రమంలో నటి హేమకు భారీ ఊరట లభించింది. అయితే నిన్న (బుధవారం) హేమ బెయిల్ పిటిషన్ పై బెంగళూరు రూరల్ ఎన్టీపీఎస్ ప్రత్యేక కోర్టు విచారణ జరిపింది. ఆమె తరఫున న్యాయవాది హేమ వద్ద ఎలాంటి డ్రగ్స్ లభ్యం కాలేదంటూ వాదనలు వినిపించి, ఆమెకు షరతులతో కూడి బెయిల్ మంజూరు చేయాలని కోర్టును కోరారు. దీంతో కోర్టు ఆమెకు షరతులతో కూడిని బెయిల్ మంజూరు చేసింది. ఇక రేవ్ పార్టీలో నటిహేమతో పాటు పలువురు టాలీవుడ్ సెలబ్రిటీలు కూడా పాల్గొన్న విషయం తెలిసిందే. ఇక హేమను బెంగళూరు పోలీసులు అరెస్ట్ చేయడంతో టాలీవుడ్.. మా ఆర్టిస్ట్ అసోసియేషన్ వారు ామె సభ్యత్వాన్ని రద్దు చేశారు.

Advertisement

Next Story

Most Viewed

    null