యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ సినీ నటి..

by sudharani |
యూట్యూబ్ ఛానల్స్‌పై పోలీసులకు ఫిర్యాదు చేసిన ప్రముఖ సినీ నటి..
X

దిశ, వెబ్‌డెస్క్: సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలపై సోషల్ మీడియాలో వార్తలు ఎప్పుడు చక్కర్లు కొడుతూనే ఉంటాయి. వాటిలో కొన్ని నిజాలు ఉంటాయి. మరికొన్ని ఫేక్ ఉంటాయి. అయితే ఇలా.. సోషల్ మీడియాలో, వెబ్‌సైట్‌ల్లో వచ్చే వార్తలు కొంత మంది సెలబ్రిటీలు చూసిచూడనట్లుగా వదిలేస్తుంటారు. మరికొందరు మాత్రం ఆ వార్తలు సృష్టించిన వారిపై చర్యలు తీసుకోవాలి అంటూ పోలీస్ స్టేషన్ మెట్లు ఎక్కుతుంటారు. తాజాగా ఇదే విధంగా చేసింది సినీ నటి హేమ.

టాలీవుడ్ సీనియర్ నటి హేమ గురించి తెలియని వారు ఉండరు. సీరియస్, కామెడీ పాత్రల్లో నటించి తనకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా.. సోషల్ మీడియాలో కూడా యాక్టీవ్‌గా ఉంటూ తనని ట్రోల్స్ చేసే వారికి కౌంటర్లు ఇస్తూ ఉంటుంది. ఈ క్రమంలోనే తాజాగా.. తనపై అసత్య ప్రచారం చేస్తున్న పలు యూట్యూబ్ ఛానల్స్, వెబ్ సైట్స్‌పై చర్యలు తీసుకోవాలని కోరుతూ ఈరోజు పోలీసులకు ఫిర్యాదు చేశారు నటి హేమ. సెలబ్రిటీలను టార్గెట్ చేస్తూ ఫేక్ న్యూస్ స్ప్రెడ్ చేస్తున్నారని, అంతేకాకుండా తన భర్తతో ఉన్న ఫొటోలను ఫేక్ తంబ్ నేల్స్ పెట్టి వైరల్ చేస్తున్నారని ఆరోపించారు. సోషల్ మీడియాలో కొందరు సెలబ్రిటీలు, సినిమా నటులు చనిపోయారని ఫేక్ న్యూస్ ప్రచారం చేస్తున్నారని మండిపడ్డారు.

Advertisement

Next Story