- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
ఇండస్ట్రీలో నన్ను తొక్కేయాలని చూస్తున్నారు.. స్టార్ హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు
దిశ, వెబ్‌డెస్క్: తమిళ చిత్ర పరిశ్రమలో హీరో విశాల్ వర్సెస్ మంత్రి ఉదయనిధి స్టాలిన్ మధ్య వార్ నడుస్తోంది. విశాల్ నటించిన రత్నం సినిమాకు థియేటర్లు ఇచ్చేందుకు తమిళనాడు వ్యాప్తంగా పలుచోట్ల యాజమాన్యాలు వెనకడుగు వేస్తున్నాయి. దీంతో ఆ రాష్ట్ర ప్రభుత్వంపై హీరో విశాల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. నా సినిమాల విడుదలకు కావాలనే కుట్రపూరితంగా అడ్డంకులు సృష్టిస్తున్నారని కీలక ఆరోపణలు చేశారు. ఇండస్ట్రీలో నన్ను అణిచివేయాలని చూస్తున్నారని అన్నారు. నష్టాలకు సంబంధించి ఫిర్యాదు చేసిన వ్యక్తులతో తనకు ఎలాంటి సంబంధం లేదని తెలిపారు. ‘కొన్ని జిల్లాల్లో నా సినిమా విడుదలకు థియేటర్స్ ఇవ్వడం లేదు. నా సినిమాలకు నష్టం చేయాలని చూస్తే ఎవరినీ వదిలిపెట్టను. చట్టపరంగా పోరాటం చేస్తా’ అని హీరో విశాల్ ప్రకటించారు.
కాగా, యాక్షన్ హీరో విశాల్, మాస్ డైరెక్టర్ హరి కాంబోలో హ్యాట్రిక్ కొట్టేందుకు రత్నం చిత్రం రాబోతోంది. ఇది వరకే ఈ ఇద్దరి కాంబోలో భరణి, పూజా వంటి యాక్షన్ మూవీస్ వచ్చి ప్రేక్షకుల్ని ఆకట్టుకున్నాయి. ఇక ఇప్పుడు మూడో సారి రత్నంతో ఈ కాంబో ఆడియెన్స్ ముందుకు రాబోతోంది. జీ స్టూడియోస్, స్టోన్ బెంచ్ ఫిల్మ్స్ సంయుక్తంగా నిర్మించిన చిత్రం ‘రత్నం’. కార్తికేయన్ సంతానం ఈ సినిమాకి నిర్మాతగా వ్యవహరించారు. రత్నం మూవీని శ్రీ సిరి సాయి సినిమాస్ బ్యానర్ మీద తెలుగులో సీహెచ్ సతీష్ కుమార్, కే రాజ్ కుమార్ సంయుక్తంగా రిలీజ్ చేస్తున్నారు. రత్నం సినిమా తెలుగు, తమిళ్ లో ఏప్రిల్ 26న గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.