Nandamuri Tarakaratna Passes away : నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత!

by Satheesh |   ( Updated:2023-02-18 16:42:39.0  )
Nandamuri Tarakaratna Passes away : నటుడు నందమూరి తారకరత్న కన్నుమూత!
X

దిశ, వెబ్‌డెస్క్: నందమూరి కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. నటుడు నందమూరి తారకరత్న (39) కన్నుమూశాడు. కాసేపట్లో వైద్యులు అధికారిక ప్రకటన చేయనున్నారు. గత నెల 27వ తేదీన టీడీపీ నేత లోకేష్ చేపట్టిన యువగళం పాదయాత్రలో పాల్గొన్న తారకరత్న తీవ్ర గుండెపోటుకు గురైన సంగతి తెలిసిందే. దీంతో కుటుంబ సభ్యులు తారకరత్నను మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని నారాయణ హృదయాలయ ఆసుపత్రికి తరలించారు. 22 రోజులుగా నారాయణ హృదయాలయ ఆసుపత్రిలో చికిత్స పొందుతోన్న తారకరత్న.. ఆరోగ్యం విషమించడంతో ఇవాళ మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు.

కాగా, తారకరత్నకు మైరుగైన వైద్యం అందించడం కోసం విదేశాల నుండి కూడా నిపుణులైన వైద్య బృందాన్ని రప్పించి చికిత్స కొనసాగించారు. నందమూరి తారకరత్నను బతికించేందుకు వైద్యులు తీవ్రంగా ప్రయత్నించినప్పటికీ ఫలితం లేకుండా పోయింది. ఇక, తారకరత్న మరణవార్త తెలుసుకున్న నందమూరి, నారా కుటుంబ సభ్యులు హుటాహుటినా బెంగళూర్‌కి బయలుదేరారు. బాలకృష్ణ ఇప్పటికే ఆసుపత్రికి చేరుకున్నారు. తారకరత్న మృతితో అతడి అభిమానులతో పాటు నందమూరి అభిమానులు శోకసంద్రంలో మునిగిపోయారు.

Also Read..

బిగ్ బ్రేకింగ్: హైదరాబాద్‌కు నటుడు నందమూరి తారకరత్న తరలింపు..?

Advertisement

Next Story