రవితేజను చూస్తే షాక్ అవ్వాల్సిందే..

by Anjali |
రవితేజను చూస్తే షాక్ అవ్వాల్సిందే..
X

దిశ, సినిమా: ‘రావణాసుర’లో రవితేజను చూసి ప్రేక్షకులు షాక్ అవుతారన్నారు నిర్మాత అభిషేక్ నామా. ఈ కొత్త కాన్సెప్ట్ వర్కవుట్ అయితే హీరోలు ఇలాంటి మరిన్ని కథలు ప్రయత్నిస్తారన్నారు. ప్రపంచవ్యాప్తంగా తానే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేస్తున్నానని తెలిపిన ప్రొడ్యూసర్.. నమ్మిన కథతో లాభమైనా, నష్టమైనా తానే భరించాలని నిర్ణయించుకున్నట్లు చెప్పాడు. డైరెక్టర్ సుధీర్ వర్మ టెక్నికల్‌గా గ్రేట్ అని.. దీంతో అనుకున్న బడ్జెట్‌లోనే మూవీ పూర్తి చేశామన్నాడు. ఆడియన్స్ సినిమాను గొప్పగా ఆదరిస్తే కచ్చితంగా సీక్వెల్ చేస్తామన్నాడు అభిషేక్.

Advertisement

Next Story