- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
పిల్లలతో ఆడుకుంటున్న శ్రీలీల.. అవకాశాల్లేకేనా ! .. వీడియో వైరల్
దిశ, సినిమా : శ్రీలీల.. సినీ లవర్స్‌కు పరిచయం అవసరం లేని పేరిది. తన యాక్టింగ్, డ్యాన్సింగ్‌తో అభిమానుల్లో మంచి గుర్తింపు తెచ్చుకున్న ఈ సన్న పెదవుల చిన్నది అనేక సినిమాల్లో హీరోయిన్‌గా చేస్తూ అలరించింది. నిన్న మొన్నటి వరకు నెలకొక సినిమా చేసిన ఈ బ్యూటీ ఎందుకో గానీ ఒక్కసారిగా సైలెంట్ అయిపోయింది. ప్రజెంట్ ఈమె చేతిలో పవన్ కళ్యాణ్ ‘ఉస్తాద్ భగత్ సింగ్’ చిత్రం తప్ప మరో మూవీ ఏదీ లేదు. హరీశ్ శంకర్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఉస్తాద్ భగత్ సింగ్ సినిమా కూడా కేవలం10 శాతం షూటింగ్ మాత్రమే పూర్తి చేసుకుంది. ప్రజెంట్ పవన్ కళ్యాణ్ ఏపీ పాలిటిక్స్‌లో బిజీ అయిపోయినందున ఈ చిత్రానికి బ్రేకులు పడ్డాయి. ఎలక్షన్ల తర్వాత షూటింగ్ మళ్లీ స్టార్ట్ అయ్యే చాన్సెస్ ఉన్నాయి. దీంతో శ్రీలీలకు కూడా రెస్టు దొరికినట్టయింది.
ఇక గుంటూరు కారం సినిమాలో ‘కుర్చీ మడత పెట్టి’ సాంగ్‌తో ఒక్కసారిగా యువత హార్ట్‌బీట్ పెంచేసిన శ్రీలీల, తర్వాత ఏ సినిమాతో వస్తుందోనని అభిమానులంతా ఈగర్‌గా వెయిట్ చేస్తుండగా, ఆమె మాత్రం ఇంట్లో పిల్లలతో ఆడుకుంటూ, నచ్చిన వెకేషన్లను, ప్రోగ్రాములను ఎంజాయ్ చేస్తు్న్నట్లు తెలుస్తోంది. ఇందుకు సంబంధించిన ఒక వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఇందులో శ్రీలీల పిల్లలతో సరదాగా ఆడుకుంటోంది. ఇది చూసిన పలువురు రకరకాలు రియాక్ట్ అవుతున్నారు. ‘కుర్చీ మడత’ సాంగ్‌తో మంట పెట్టి, ఇప్పుడు పిల్లలతో ఆడుకుంటూ ఎంజాయ్ చేస్తోంది’ అని పలువురు కామెంట్ చేస్తుండగా, అవకాశాలు లేకపోవడంతో ఖాళీగా ఉండలేక ఆడుకుంటోందని మరికొందరు స్పందిస్తున్నారు.