The Raja Saab: ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ పై థమన్ నుంచి సూపర్ అప్డేట్

by Prasanna |
The Raja Saab:  ‘రాజా సాబ్’ ఫస్ట్ సింగిల్ పై థమన్ నుంచి సూపర్ అప్డేట్
X

దిశ, సినిమా: బాహుబలి తర్వాత ప్రభాస్ రేంజ్ మొత్తం మారిపోయింది. అతను తీసే ఏ సినిమా అయినా సరే పాన్ ఇండియాగా తెరకెక్కుతుంది. తాజాగా ప్రభాస్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ సినిమాలలో ‘ది రాజా సాబ్’ కూడా ఒకటి. ఈ సినిమాకి డైరెక్టర్ మారుతి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ మూవీ అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ ఎంతగానో ఎదురు చూస్తున్నారు.

రీసెంట్ గా ఈ మూవీ నుంచి గ్లింప్స్ విడుదల చేశారు. దీనిలో, డార్లింగ్ లుక్ అందర్ని ఆకట్టుకుంది. ఇక తాజాగా, ఈ సినిమా ఫస్ట్ సింగిల్ పై మ్యూజిక్ డైరెక్టర్ థమన్ సూపర్ అప్డేట్ ఇచ్చారు. ‘రాజా సాబ్’ మొదటి పాట జనవరిలో విడుదల చేయనున్నారని ట్విట్టర్ ద్వారా వెల్లడించాడు. ఈ అప్డేట్ తో ప్రభాస్ అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ మూవీపై అంచనాలు భారీగా ఉన్నాయి. రొమాంటిక్ హారర్ కామెడీతో తెరకెక్కనుంది ఈ మూవీ 2025 ఏప్రిల్ లో విడుదలవ్వనుంది

Advertisement

Next Story

Most Viewed