మూడేళ్ల తర్వాత మురుగదాస్ గ్రాండ్‌ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో

by Anjali |   ( Updated:2023-09-25 11:10:09.0  )
మూడేళ్ల తర్వాత మురుగదాస్ గ్రాండ్‌ ఎంట్రీ.. క్లారిటీ ఇచ్చిన యంగ్ హీరో
X

దిశ, సినిమా: తమిళ యంగ్ హీరో శివకార్తికేయన్, స్టార్ డైరెక్టర్ మురుగదాస్ కాంబో నుంచి సాలిడ్ అప్ డేట్ వెలువడింది. ఇటీవలే ‘మహావీరుడు’తో ప్రేక్షకులను అలరించిన శివ రీసెంట్‌గా తన నెక్ట్స్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన డిటెయిల్స్‌ను అధికారికంగా ప్రకటించాడు. ఈ మేరకు ప్రముఖ దర్శకుడు మురుగదాస్ బర్త్ డే సందర్భంగా అతన్ని కలిసి విష్ చేసిన హీరో.. మురుగదాస్ డైరెక్షన్‌లో సినిమా చేయబోతున్నట్లు తెలిపాడు.

‘డియర్ సర్.. హ్యాపీ బర్త్ డే. నా 23వ సినిమా మీతో చేయడం ఆనందంగా ఉంది. మీరు చెప్పిన స్టోరీ నన్నెంతో అట్రాక్ట్ చేసింది. నాలో మరింత ఉత్సాహం, ఆనందం పెరిగింది. షూటింగ్ కోసం చాలా ఎగ్జయిటింగ్‌గా వెయిట్ చేస్తున్నా. ఈ మూవీ నా కెరీర్‌లో స్పెషల్‌గా నిలిచిపోతుంది’ అంటూ హ్యాపీగా ఫీల్ అయ్యాడు. ఇక మూడేళ్ల తర్వాత మురుగదాస్ మెగా ఫోన్ పట్టబోతున్న చిత్రానికి.. అనిరుధ్ సంగీతం అందించనున్నట్లు సమాచారం.

Advertisement

Next Story

Most Viewed