‘RRR’ లాంటి సినిమా తీయాలి.. ఆ ఇండస్ట్రీకి Pawan Kalyan కీలక సూచన..

by Sathputhe Rajesh |   ( Updated:2023-07-26 04:05:26.0  )
‘RRR’ లాంటి సినిమా తీయాలి.. ఆ ఇండస్ట్రీకి Pawan Kalyan కీలక సూచన..
X

దిశ, వెబ్‌డెస్క్: ‘బ్రో’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్‌లో పవన్ కల్యాణ్ పలు కీలక అంశాలపై మాట్లాడారు. తమిళ ఇండస్ట్రీకి కీలక విన్నపం చేశారు. పరిశ్రమలో మనవాళ్లే చేయాలి అనే ధోరణి నుంచి బయటకు రావాలన్నారు. ఈ రోజు తెలుగు ఇండస్ట్రీ అనేక మందికి అన్నం పెడుతుందన్నారు. తమిళ్ పరిశ్రమ వాళ్లు కూడా కేవలం తమిళ్ వారికే అవకాశాలు అంటే ఎదగదు అన్నారు. అన్ని పరిశ్రమలకు సంబంధించిన వారిని తీసుకుంటే పరిశ్రమ ఎదుగుతుందన్నారు. తెలుగు ఇండస్ట్రీ ప్రస్తుతం అన్ని ఇండస్ట్రీల వారిని కలుపుకుపోయి అద్భుతమైన సినిమాలు తీస్తోందన్నారు.

తమిళ్ ఇండస్ట్రీ బయటికి వచ్చి ఆర్ ఆర్ ఆర్ లాంటి సినిమా తీయాలని కోరారు. పరిశ్రమను మరింత విస్తృతం చేసుకోవాలని కోరుకుంటున్నా అని అన్నారు. ఒక రోజా వచ్చిదంటే దానికి కారణం..ఏఎం రత్నం అని, ఆయన కారణంగానే రోజా, జెంటిల్ మెన్ సినిమాలు బయటకు వచ్చాయన్నారు. కళాకారుడికి కులం, మతం, ప్రాంతం ఉంటే పరిశ్రమ ఎదగదన్నారు. ఏవైనా కార్మిక సమస్యలు ఉంటే పరిష్కరించుకుని పరిధులు దాటి ఎదగాలని పిలుపునిచ్చారు. కాగా బ్రో మూవీ ఈ నెల 28న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Also Read: ‘BRO’ సినిమాలో తన పాత్రపై Pawan Kalyan కీలక వ్యాఖ్యలు..

Advertisement

Next Story