హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు..

by Satheesh |   ( Updated:2023-05-23 06:21:47.0  )
హీరోయిన్ డింపుల్ హయతిపై క్రిమినల్ కేసు..
X

దిశ, జూబ్లీహిల్స్: హీరోయిన్ డింపుల్ హాయతిపై జూబ్లీహిల్స్ పోలీస్ స్టేషన్లో్ క్రిమినల్ కేసు నమోదు అయింది. పార్కింగ్ చేసి ఉన్న హైదరాబాద్ ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే కారును ఆమె కారుతో ఢీకొట్టి ధ్వంసం చేసిన వ్యవహారంపై డీసీపీ డ్రైవర్ ఇచ్చిన ఫిర్యాదుతో జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఆమెతో పాటు ఉన్న డేవిడ్ అనే వ్యక్తిపై కూడా పోలీసులు కేసు నమోదు చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జర్నలిస్ట్ కాలనీలోని హుడా ఎంక్లేవ్‌లో ట్రాఫిక్ డీసీపీ రాహుల్ హెగ్డే నివాసం ఉంటున్నారు. అదే అపార్ట్మెంట్‌లో నటి డింపుల్ హయతి, డేవిడ్ ఉంటున్నారు. ట్రాఫిక్ డీసీపీకి చెందిన ప్రభుత్వ వాహనాన్ని ఆయన డ్రైవర్‌గా ఉన్న కానిస్టేబుల్ చేతన్ కుమార్ అపార్ట్మెంట్ సెల్లార్లో పార్కింగ్ చేస్తున్నారు.

ఆయన వాహనం పక్కనే నటి డింపుల్ హాయతి డేవిడ్‌లు తమ వాహనాన్ని పార్కింగ్ చేస్తున్నారు. ప్రతిరోజు డీసీపీ వాహనానికి ఉన్న కవర్‌ను తొలగించడం, వాహనానికి అడ్డుగా పెట్టిన కోన్‌లను కాలితో తన్నడం వంటి పనులు చేస్తున్నారు. ఇదే క్రమంలో ఈ నెల 14న డింపుల్ హైయతి తన వాహనంతో డీసీపీ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో పార్కింగ్ చేసి ఉన్న డీసీపీ కారు ముందు భాగం దెబ్బతిన్నది.

సీసీ టీవీ ఫుటేజ్ ద్వారా కారణాన్ని తెలుసుకున్న డ్రైవర్ చేతన్ కుమార్ జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. డింపుల్ హైయతి, డేవిడ్‌లపై చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఇందుకు సంబంధించిన సీసీ టీవీ ఫుటేజ్‌లను కూడా పోలీసులకు సమర్పించారు. ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డింపుల్ హైయతి, డేవిడ్లను పోలీస్ స్టేషన్‌కు పిలిచి నోటీసులు ఇచ్చి పంపించేశారని తెలిపారు.

Read More: ‘‘అధికారాన్ని అడ్డుపెట్టుకుని తప్పు కప్పిపుచ్చుకోలేరు’’.. వివాదంపై డింపుల్ ఇంట్రెస్టింగ్ ట్వీట్

Advertisement

Next Story