టాలెంట్‌ను గుర్తించలేకపోతున్న మేనేజ్‌మెంట్స్.. స్కిల్స్ ఉన్నవారిని పట్టుకోవడంలో విఫలం

by sudharani |   ( Updated:2023-03-17 13:07:31.0  )
టాలెంట్‌ను గుర్తించలేకపోతున్న మేనేజ్‌మెంట్స్.. స్కిల్స్ ఉన్నవారిని పట్టుకోవడంలో విఫలం
X

దిశ, ఫీచర్స్: ఇండియాలో 80 శాతం మంది యజమానులు తమకు అవసరమైన టాలెంట్‌ను గుర్తించడంలో చాలా కష్టాలను ఎదుర్కొంటున్నారని లీడింగ్ గ్లోబల్ వర్క్‌ఫోర్స్ సొల్యూషన్స్ కంపెనీ మ్యాన్‌ పవర్‌ గ్రూప్ ఈ వారం విడుదల చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌ లుక్ సర్వే పేర్కొన్నది. మెటా, మైక్రోసాఫ్ట్, గూగుల్ వంటి టెక్ దిగ్గజాలతో సహా అనేక కంపెనీల్లోని ఈ మధ్య చాలా మంది ఉద్యోగాలు ఊడుతున్నాయి. అయితే పెద్ద ఎత్తున ఉద్యోగులను తొలగిస్తు్న్న ఈ సంస్థలు, వాటి యాజమాన్యాలకు కూడా తమకు అవసరమైన టాలెంట్‌గల ఉద్యోగులను గుర్తించడం అంత ఈజీ కాదనిపిస్తోంది. ఎందుకంటే.. రాబోయే త్రైమాసికంలో (ఏప్రిల్-జూన్ 2023) లోయర్ స్కిల్స్ ఉన్న వ్యక్తులను గుర్తించడం అనేది కంపెనీలకు పెద్ద సవాలుగా మారనుందని, ఈ కారణంగా నియామకాలు కూడా చాలా తక్కువగా ఉంటాయని తాజా సర్వే పేర్కొంది.

మ్యాన్ పవర్ గ్రూప్స్ చెప్పిందేమిటి?

లీడింగ్ గ్లోబల్ వర్క్‌ ఫోర్స్ సొల్యూషన్స్ కంపెనీ మ్యాన్‌ పవర్‌ గ్రూప్ ఈ వారం విడుదల చేసిన ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే(Employment Outlook Survey) ప్రకారం.. ఐటీ రంగంలోని యజమానులు 81 శాతం, కన్జ్యూమర్ గూడ్స్ అండ్ సర్వీసెస్ 81 శాతం, హెల్త్ కేర్ అండ్ లైఫ్ సైన్సెస్ 80 శాతం, ఫైనాన్షియల్స్ అండ్ రియల్ ఎస్టేట్ 80 శాతం, ఎనర్జీ అండ్ యుటిలిటీస్ (80 శాతం) తమకు అవసరమైన టాలెంట్‌ను కనుగొనడం చాలా కష్టమైన ప్రక్రియగా పేర్కొన్నాయి. పెద్ద పెద్ద సంస్థలు 80 శాతం, సూక్ష్మ తరహా సంస్థలు 80 శాతం, చిన్న తరహా సంస్థలు 78 శాతంతో పోలిస్తే మధ్య తరహా సంస్థల్లోని (83 శాతం) యజమానులు అతిపెద్ద సవాల్‌ను ఎదుర్కొంటున్నారని పేర్కొంది.

2 శాతం తగ్గనున్న నియామకాలు

భారతదేశంలోని యజమానులు రెండవ త్రైమాసికంలో కార్మికులను నియమించుకోవాలని ఎదురుచూస్తూనే ఉన్నారు. కాలానుగుణంగా సర్దుబాటు చేయబడిన నికర ఉపాధి ఔట్‌లుక్‌ను 30 శాతంగా పేర్కొన్నారు. ఇది జనవరి నుంచి మార్చి త్రైమాసికం కంటే స్వల్పంగా తక్కువ. సరైన టాలెంట్‌ను కనుగొనడంలో యజమానులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నందున, నియామక ఉద్దేశాలు త్రైమాసికంలో 2 శాతం తక్కువగా ఉన్నాయి. మ్యాన్‌పవర్‌ గ్రూప్ ఎంప్లాయ్‌మెంట్ ఔట్‌లుక్ సర్వే, పీటీఐ(PTI) ప్రకారం.. దాదాపు 3,020 మంది ఎంప్లాయర్స్ ఎనాలిసిస్‌పై ఆధారపడింది. యజమానుల స్లైడింగ్ షిఫ్ట్‌(sliding shift)లో పేర్కొన్న అవసరమైన స్కిల్స్‌తో కూడిన ప్రతిభ లేదని, 3 శాతం ఈ విధమైన టాలెంట్ కొరతను మేనేజ్‌మెంట్స్ ఎదుర్కొంటున్నాయని సర్వే వెల్లడించింది.


స్కిల్స్ గ్యాప్‌పై చర్చ

‘ఒకవైపు స్కిల్ గ్యాప్‌పై సర్వత్రా చర్చ కొనసాగుతుండగా, గ్లోబల్ ఎకానమికల్ ప్రెషర్స్ వంటి ఒత్తిళ్లను ఎదుర్కోవడంలో తన సత్తాను ఇప్పటికే అనేకసార్లు నిరూపించుకుంది. అయితే ‘‘ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌లో ప్రభుత్వం పెట్టుబడులు పెట్టడం, రాష్ట్రాల మధ్య కనెక్టివిటీని మెరుగుపరచడం ద్వారా వ్యాపారం చేయడాన్ని సులభతరం చేసే ప్రయత్నాలు ఉపాధి పెంపొందించే సానుకూల దృక్పథాన్ని ప్రభావితం చేస్తున్నాయి’’ అని మ్యాన్‌పవర్‌ గ్రూప్ ఇండియా అండ్ మిడిల్ ఈస్ట్ మేనేజింగ్ డైరెక్టర్ సందీప్ గులాటి అన్నారు. స్కిల్స్ పెంచడం(upskilling), రీస్కిల్లింగ్‌(reskilling)లో పెట్టుబడి పెట్టడం, రేపటి ఉద్యోగాల కోసం ప్రజలను సిద్ధం చేయడంపై దృష్టి పెట్టడం మేనేజ్‌మెంట్ ప్రధాన బాధ్యత అన్నారు.

Advertisement

Next Story

Most Viewed