ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్..

by sudharani |
ఘనంగా ‘6జర్నీ’ టీజర్ లాంచ్..
X

దిశ, సినిమా: పాల్యం శేషమ్మ, బసిరెడ్డి సమర్పణలో అరుణ కుమారి ఫిలింస్ బ్యానర్‌పై రూపొందుతున్న చిత్రం ‘6జర్నీ’. రవి ప్రకాష్ రెడ్డి, సమీర్ దత్త, టేస్టీ తేజ, పల్లవి, రమ్యా రెడ్డి తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ సినిమాకు బసీర్ అలూరి దర్శకత్వం వహించగా.. పాల్యం రవి ప్రకాష్ రెడ్డి నిర్మిస్తున్నారు. సెన్సార్ కార్యక్రమాల‌కు సిద్ధమైన ఈ సినిమాను త్వర‌లోనే రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేస్తున్నారు మేక‌ర్స్. ఈ క్రమంలోనే తాజాగా ఈ మూవీ టీజ‌ర్‌ను పటేల్ రమేష్ రెడ్డి విడుద‌ల చేశారు. ఈ సంద‌ర్భంగా పటేల్ రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ‘సినిమా టీజర్‌ను లాంచ్ చేయడం ఆనందంగా ఉంది. నిర్మాత రవి ప్రకాష్ రెడ్డి, దర్శకుడు బషీర్ మూవీని తెర‌కెక్కించిన విధానం బావుంది. టీజర్, విజువల్స్, ఆర్ఆర్ అన్ని చాలా బాగున్నాయి. సినిమా టీంకు ఆల్ ది బెస్ట్.’ అని అన్నారు.

ఇక దర్శకుడు బసీర్ మాట్లాడుతూ.. ‘మా అందరినీ ఆశీర్వదించేందుకు వచ్చిన రమేష్ రెడ్డి అన్నకి, వెంకట్ రెడ్డి అన్నకి, ప్రతాప్ రెడ్డి అన్నకి, మీడియా మిత్రులకు థాంక్స్. మా హీరో సమీర్ ఎంతో కష్టపడి నటించారు. రవి ప్రకాష్ రెడ్డి ఈ మూవీని ముందుండి నడిపించారు. మా హీరోయిన్లు అద్భుతంగా నటించారు. టేస్టి తేజ ఎనర్జీతో నటించాడు. మాకు సింహ గారు మంచి పాటలు ఇచ్చారు. సురేందర్ రెడ్డి గారు మా అందరికీ టీచర్. ఈ మూవీ ఇక్కడకు వచ్చిందంటే అది ఆయన వల్లే. ఆయనకు ఎప్పుడూ రుణపడి ఉంటాను. నాకు ఇంత మంచి ఛాన్స్ ఇచ్చిన మా నిర్మాతకు థాంక్స్’ అని అన్నారు.

Advertisement

Next Story