- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
Akkineni's Heroes కు కలిసిరాని 2022.. పాపం ఇన్ని సమస్యలా?
దిశ, వెబ్‌డెస్క్ : టాలీవుడ్ స్టార్ హీరోలలో ఈ సంవత్సరం అక్కినేని హీరోస్‌కి కలిసి రాలేదని చెప్పవచ్చు. ఈ ముగ్గురు హీరోలు ఈ ఇయర్ మంచి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చినా అవి అంత పెద్దగా సక్సెస్ కాలేదు. ఒక బంగార్రాజు సినిమా తప్పితే, మిగితా సినిమాలన్నీ డిజాస్టర్‌లుగా మిగిలి పోయాయి. అక్కినేని హీరో నాగార్జున నటించిన ద గోస్ట్ మూవీ ఘోర పరాజయాన్ని చవి చూసింది. అలాగే, సమంతతో విడాకుల తర్వాత నాగచైతన్య తీసిన మూవీ థాంక్యూ డిజాస్టర్‌ను సొంత చేసుకుంది.
ఇక ఈ ఇయర్‌లో అఖిల్ ఏజెంట్ సినిమా విడుదలవుతుందని చూసిన అక్కినేని అభిమానులకు నిరాశనే ఎదురైంది. అంతే కాకుండా 2022 సంవత్సరంలో బిగ్ బాస్ కూడా అక్కినేని నాగార్జునకు కలిసిరాలేదనే చెప్పవచ్చు. బిగ్ బాస్ సీజన్ 6కు ఊహించినంత రెస్పాన్స్ రాకపోవడమే కాకుండా, నాగార్జున చాలా విమర్శలు ఎదుర్కొన్నాడు. దీంతో వచ్చే సీజన్‌లో నాగార్జున హోస్టింగ్ నుంచి కూడా తప్పుకున్నట్లు తెలుస్తోంది. ఇక ఈ ఇయర్ ఈ హీరోస్‌కి కలిసిరాలేదని, వచ్చే సంవత్సరమైనా కలిసిరావాలని అక్కినేని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.
ఇవి కూడా చదవండి : చిరుకు నేను హార్డ్‌కోర్ అభిమానిని: స్టార్ డైరెక్టర్