- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
రేపటి నుంచి థియేటర్లు, మల్టీప్లెక్స్‌లు ఓపెన్..
దిశ, వెబ్‌డెస్క్ : రాష్ట్రంలోని థియేటర్లు, మల్టిప్లెక్స్‌ల రీఓపెనింగ్‌కు తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం ఉత్తర్వులు వెలువడ్డాయి. కరోనా నేపథ్యంలో 50 శాతం సీటింగ్ కెపాసిటీతో మాత్రమే సినిమా హాళ్లు నడిపించాలని రాష్ట్ర ప్రభుత్వం ఆదేశించింది. అంతే కాకుండా మాస్కులు, శానిటైజర్లను తప్పనిసరిగా వాడాలని నిబంధనలు పెట్టింది.టెంపరేచర్ 24 నుంచి 30 మధ్య ఉండేలా చూడాలని థియేటర్ యాజమాన్యాలకు స్పష్టం చేసింది.
గ్రేటర్ ఎన్నికల మేనిఫెస్టో విడుదల సందర్భంగా సీఎం కేసీఆర్ ఈ ప్రకటన చేశారు. అయితే, సినిమా టిక్కెట్ల ధరలను సవరించుకునే అధికారాన్ని తెలంగాణ ప్రభుత్వం థియేటర్ల సంఘాలపైనే వదిలేసింది. అలాగే, రాష్ట్రంలోని అన్ని సినిమా థియేటర్లు ప్రతిరోజూ ప్రదర్శించే షోల సంఖ్యను పెంచుకునేందుకు ఇతర రాష్ట్రాల్లో ఉన్నట్లుగానే ఇక్కడ కూడా అవకాశం కల్పిస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ నిర్ణయం వలన సినీ పరిశ్రమపై ఆధారపడిన సుమారు 40 వేల కుటుంబాలకు పరోక్షంగా ఉపశమనం లభిస్తుందన్నారు.