నోరు జారిన జగన్.. 'రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తూ ఓ మహిళ' (వీడియో)

by Anukaran |   ( Updated:2021-06-29 04:31:58.0  )
నోరు జారిన జగన్.. రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తూ ఓ మహిళ (వీడియో)
X

దిశ, ఏపీ బ్యూరో: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మరోసారి టంగ్ స్లిప్ అయ్యారు. రాష్ట్రముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ అంటూ టంగ్ స్లిప్ అయ్యారు. ‘దిశ’ మొబైల్‌ యాప్‌ అవగాహన సదస్సులో భాగంగా మంగళవారం విజయవాడ రూరల్‌ మండలం గొల్లపూడి గ్రామంలో జగన్ పర్యటించారు. ఈ సందర్భంగా మహిళా భద్రత కోసం రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన దిశ మొబైల్‌ యాప్‌ను విద్యార్థినులు, యువతులు, మహిళలు డౌన్‌లోడ్‌ చేసుకోవాల్సిన అవసరాన్ని ఆయన స్వయంగా వివరించారు. ఈ సందర్భంగా టంగ్ స్లిప్ అయ్యారు.

దిశ యాప్ గురించి చెబుతూ.. ‘ఇంత ధైర్యంగా ఎందుకు చెప్పగలుగుతున్నా అంటే మన రాష్ట్ర ముఖ్యమంత్రి సాక్షాత్తు ఓ మహిళ కాబట్టి’ అన్నారు. వెంటనే హోంమంత్రి మేకతోటి సుచరిత కల్పించుకుని.. ‘హోమ్ మినిస్టర్’ అని గుర్తు చేశారు. దీంతో జగన్ నవ్వుతూ ‘హోంమంత్రి మహిళ’ అని సరిదిద్దుకున్నారు. అయితే ఆయన వ్యాఖ్యలను ఇతర పార్టీల కార్యకర్తలు సోషల్‌మీడియాలో వైరల్ చేస్తున్నారు. గతంలో దిశ చట్టంపై అసెంబ్లీలో సీఎం జగన్ మాట్లాడినప్పుడు కూడా టంగ్ స్లిప్ అయ్యారు. టోల్ గేట్ దగ్గర టోల్ కట్టడానికి ఆమె బైక్ దిగింది అంటూ చేసిన వ్యాఖ్యలు నెట్టింట తెగ వైరల్ అయిన సంగతి తెలిసిందే

Advertisement

Next Story