- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
యాదాద్రి జిల్లాలో ప్రభుత్వానికి షాకిచ్చిన లేడీ ఎంపీపీ
దిశ, మోత్కూరు: ప్రజాప్రతినిధిగా గెలిచి ఉత్సవ విగ్రహంగా ఉండడం కంటే రాజీమానా చేయడమే ఉత్తమమని యాదాద్రి జిల్లాకు చెందిన ఓ ఎంపీపీ తన పదవికి రాజీనామా చేసింది. అధికారం చేపట్టి ఏళ్లు గడుస్తోన్న పైసా నిధులు రాలేదని ఆవేదన వ్యక్తం చేసింది. జిల్లాలోని మోత్కూరు ఎంపీపీ ధీటి సంధ్యారాణి ఈ సంచలన నిర్ణయం తీసుకుంది. శుక్రవారం తన రాజీనామా లేఖను యాదాద్రి జడ్పీ సీఈవోకు అందజేసింది. అనంతరం ఆమె మాట్లాడారు.
పదవీ బాధ్యతలు చేపట్టి రెండున్నరేండ్ల కాలంలో ఎలాంటి నిధులలు రాలేదని వాపోయింది. ఎంపీటీసీల పట్ల తెలంగాణ ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరుకు నిరసనగానే తాను రాజీనామా చేస్తున్నట్లు సంధ్యారాణి ప్రకటించారు. రెండున్నర ఏళ్లుగా నిధులు లేక ఎంపీపీ స్థాయిలో ఉండి కూడా చిన్న సమస్యలను కూడా పరిష్కరించలేక పోతున్నాని ఆవేదన వ్యక్తం చేశారు. ఎంపీపీగా ఉత్సవ విగ్రహంలా ఉండలేకనే రాజీనామా చేసినట్లు తెలిపారు. తన రాజీనామాపై ఎవరి ఒత్తిడి, బలవంతం లేదని పేర్కొన్నారు. కాగా సంధ్యారాణి కాంగ్రెస్ పార్టీ నుంచి గెలుపొంది.. ప్రస్తుతం బీజేపీలో కొనసాగుతున్నారు.