- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సంగారెడ్డిలో దారుణం.. ఇద్దరు పిల్లలకు ఉరేసి.. చివరకు..!
దిశ, సంగారెడ్డి : పిల్లల అనారోగ్య సమస్యలకు తోడు ఆర్థిక ఇబ్బందుల కారణంగా ఓ మాతృమూర్తి తన హృదయాన్ని కఠినం చేసుకొని ఇద్దరు పిల్లలను చంపి తానూ ఆత్మ హత్యాయత్నానికి పాల్పడింది. ఈ ఘటన సంగారెడ్డి జిల్లాలోని శాంతినగర్‌లో శుక్రవారం ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసులు, బంధువుల కథనం ప్రకారం.. పట్టణంలోని ఇండియన్ బ్యాంక్‌లో క్యాషియర్‌గా పనిచేస్తున్న శివశంకర్ ఆదిలాబాద్ నుంచి బదిలీ అయి సంగారెడ్డికి వచ్చారు. శివశంకర్, జోత్స్న దంపతులకు ఇద్దరు కుమారులు. రుద్రాక్షు (6) దేవాన్ష్ (4). వీరంతా కలిసి శాంతినగర్‌లోని ఓ అద్దె ఇంట్లో నివాసముంటున్నారు.
పెద్ద అబ్బాయి రుద్రక్షుకు పుట్టినప్పటి నుంచి రెండు కిడ్నీల సమస్య ఉండగా, చిన్న అబ్బాయి దేవాన్ష్‌కు మోషన్ సమస్య ఉంది. పిల్లలిద్దరికీ హైదరాబాద్ బంజారాహిల్స్‌లోని రైన్ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ఈ క్రమంలోనే వీరికి ఆర్థిక సమస్యలు ఎక్కువయ్యాయి. వైద్యులు కూడా పిల్లల జబ్బులు పూర్తిగా నయం కావని, జీవితాంతం ఉంటాయని చెప్పినట్లు సమాచారం. విషయం తెలియడంతో జోత్స్న పిల్లలను చంపి తాను చావాలని నిర్ణయించుకుంది. శివశంకర్ శుక్రవారం ఉదయం బ్యాంక్‌కు వెళ్లిన తరువాత మధ్యాన్నం సమయంలో ఇంటిలోనే ఇద్దరు కుమారులకు చున్నీతో ఉరి వేసి చంపేసింది. ఆ తర్వాత ఇంటికి తాళం వేసిన జోత్స్న మహబూబ్ సాగర్ చెరువు వద్దకు వెళ్ళింది.
అక్కడి నుంచి తన భర్త శివశంకర్‌కు వాట్సాప్ నందు ఫొటో పంపి చెరువులో దూకింది. ఆ సమయంలో అక్కడే చెరువు కట్ట మీద వున్న వాళ్ళు ఆమెను గమనించి పైకి తీసారు. వెంటనే ఆమె భర్త శివశంకర్ అక్కడికి చేరుకుని తన భార్యను శాంతి నగర్ లోని తన ఇంటికి తీసుకెళ్లాడు. తాళం తీసి ఇంటిలో చూసే సరికి ఇద్దరు పిల్లలు బెడ్ పై పడివున్నారు. వెంటనే శివశంకర్ తన భార్యను, ఇద్దరు పిల్లలను ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్ళాడు. పిల్లలను పరీక్షించిన వైద్యులు చనిపోయారని నిర్ధారించారు. జోత్స్నను ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు. శివశంకర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్టు సంగారెడ్డి పట్టణ ఇన్‌స్పెక్టర్ బి.రమేష్ తెలిపారు.