భైంసాలో తల్లి, కూతుళ్ల ఆత్మహత్య..!

దిశప్రతినిధి, ఆదిలాబాద్: నిర్మల్ జిల్లా భైంసాలో తల్లి, కూతుళ్ళ ఆత్మహత్య కలకలం రేపుతోంది. రామ్‎నగర్‎లో నివాసముంటున్న హన్షెట్టి భాగ్యశ్రీ శివరాజ్, ఆమె కూతురు సిన్నీ శివరాజ్ సోమవారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. మహారాష్ట్రలోని నాందేడ్ జిల్లా బెల్దరా గ్రామానికి చెందిన వీరు.. గత 20ఏళ్లుగా భైంసాలో నివాసం ఉంటున్నారు. గత 15 ఏళ్లుగా భాగ్యశ్రీ భర్తతో కలిసి వుండడం లేదు. కేసు నమోదు చేసిన పోలీసులు.. ఆత్మహత్యకు గల కారణాలపై విచారణ చేపట్టారు.

Advertisement