అత్తతో కలిసి భర్తను హతమార్చిన ఇల్లాలు

by srinivas |   ( Updated:2020-07-22 00:54:18.0  )
అత్తతో కలిసి భర్తను హతమార్చిన ఇల్లాలు
X

దిశ, ఏపీ బ్యూరో: భర్త వేధింపులు తాళలేక అత్తతో కలిసి భర్తను హతమార్చిందో ఇల్లాలు. చిత్తూరు జిల్లాలోని పలమనేరు మండలం నక్కపల్లిలో చోటు చేసుకున్న దారుణం వివరాల్లోకి వెళ్తే… మద్యానికి బానిసైన లోకనాథరెడ్డి భార్య, తల్లిపై నిత్యం వేధింపులకు పాల్పడేవాడు. అతని ఆగడాలు భరించలేకపోయిన వాళ్ళిద్దరూ దారుణానికి ఒడిగట్టారు. విషయం తెలిసిన వెంటనే పోలీసులు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.

Advertisement

Next Story