'వాడు ఎవడు'.. మంత్రి ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్

by S Gopi |
వాడు ఎవడు.. మంత్రి ఆవిష్కరించిన ఫస్ట్ లుక్ పోస్టర్
X

దిశ, సినిమా : కార్తికేయ, అఖిల నాయర్ జంటగా తెరకెక్కిన చిత్రం 'వాడు ఎవడు'. సస్పెన్స్ థ్రిల్లర్‌గా రాబోతున్న ఈ మూవీ ఫస్ట్ లుక్‌ పోస్టర్‌ను తాజాగా తలసాని శ్రీనివాస్ యాదవ్ చేతుల మీదుగా రిలీజ్ చేయించారు మేకర్స్. ఈ సందర్భంగా మాట్లాడిన మంత్రి.. ఇటీవల విడుదలైన టీజర్ బాగుందని, యదార్థ సంఘటనల ఆధారంగా రూపొందిన ఈ చిత్రం ఘన విజయం సాధించాలని కోరుతూ మూవీ యూనిట్‌కు శుభాకాంక్షలు తెలిపారు. ఇక సమాజంలో అసాంఘిక శక్తులను ఎదుర్కోలేక మహిళల జీవితాలు అర్ధాంతరంగా ముగుస్తున్నాయని, వైజాగ్‌లో జరిగిన అలాంటి సంఘటన స్ఫూర్తిగా చిత్రీకరించిన ఈ సినిమా ప్రేక్షకులను తప్పకుండా ఆకట్టుకుంటుందని చిత్ర బృందం ఆకాంక్షించింది. రాజేశ్వరి సినీ క్రియేషన్స్ పతాకంపై మాధురి, పూజిత సమర్పణలో ఎన్. శ్రీనివాసరావు స్వీయ దర్శకత్వంలో నిర్మిస్తున్న చిత్రానికి కథ, మాటలు, స్రీన్ ప్లే రాజేశ్వరి పాణిగ్రహి అందిస్తుండగా ప్రమోద్ కుమార్ స్వరాలు సమాకూర్చారు.

Advertisement

Next Story