- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
న్యూఢిల్లీ: కేంద్రం విధించిన దేశవ్యాప్త లాక్‌డౌన్ మరో మూడు రోజులు ముగుస్తున్న నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోడీ.. రాష్ట్రాల ముఖ్యమంత్రులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. నాలుగు గంటలపాటు సాగిన ఈ కాన్ఫరెన్స్‌లో కనీసం పది రాష్ట్రాల సీఎంలు ఇప్పుడు అమల్లో ఉన్న లాక్‌డౌన్‌ను అలాగే పొడిగించాలని కోరారు. ముఖ్యంగా పంజాబ్, మహారాష్ట్ర, ఢిల్లీ సీఎంలు ఈ నెల చివరి వరకు తప్పకుండా లాక్‌డౌన్ పొడిగించాలని సూచించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో ప్రధాని మోడీ వన్‌బైవన్ సీఎంలతో మాట్లాడారు. ముఖ్యమంత్రులు ఇచ్చిన సూచనలను స్వీకరించారు. బీజేపీయేతర పాలిత రాష్ట్రాల సీఎంలు కొవిడ్ 19ను ఎదుర్కొనేందుకు కేంద్రం ఆర్థిక ప్యాకేజీని అందించాలని కోరారు. అలాగే, తమ రాష్ట్రాల్లో చిక్కుకున్న వలసకార్మికులను ఎన్ని రోజులపాటు ఆశ్రయం కల్పించాల్సి ఉంటుందని అడిగారు. హోమ్ మేడ్ మాస్క్ ధరించి మోడీ పాల్గొన్న ఈ సమావేశంలో కేంద్ర ఆరోగ్య శాఖ ప్రస్తుత కరోనా పరిస్థితులపై ప్రెజెంటేషన్ ఇచ్చారు. ఈ వీడియో కాన్ఫరెన్స్‌లో తెలంగాణ సీఎం కేసీఆర్, ఆంధ్రప్రదేశ్ సీఎం వైఎస్ జగన్, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్, పంజాబ్ సీఎం అమరీందర్ సింగ్, పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ, రాజస్తాన్ సీఎం అశోక్ గెహ్లాట్ సహా పలువురు ముఖ్యమంత్రులు పాల్గొన్నారు.
ఇటీవలే అన్ని పార్టీల ఫ్లోర్ లీడర్‌లతో మోడీ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఆ కాన్ఫరెన్స్‌లోనూ లాక్‌డౌన్ పొడిగించాలనే విజ్ఞప్తులే ప్రధానంగా వచ్చాయి. అయితే, రాష్ట్రాల సీఎంలతో చర్చించిన తర్వాతే లాక్‌డౌన్ పొడిగింపుపై తుది నిర్ణయం తీసుకోబోతున్నట్టు అప్పుడు ప్రభుత్వవర్గాలు వెల్లడించిన విషయం తెలిసిందే. కాగా, ఈ రోజు ముఖ్యమంత్రులు చేసిన సూచనలను పరిగణనలోకి తీసుకోబోతున్నట్టు ప్రభుత్వవర్గాలు తెలిపాయి. రెండు మూడు రోజుల్లో ఈ నెల ద్వితీయార్థంపై తీసుకోవాల్సినమార్గదర్శకాలను సర్కారు ప్రకటించబోతున్నట్టు వివరించాయి.
24బై7 అందుబాటులో ఉంటా : పీఎం
ఈ కష్టకాలంలో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడూ రాష్ట్రాలకు అండగా ఉంటుందని ప్రధాని హామీనిచ్చారు. మనమందరం ఒకరికొకరు సమన్వయం చేసుకుంటూ కలిసి ఈ మహమ్మారిని తరిమేయాలని అన్నారు. 24బై7 తాను సీఎంలకు అందుబాటులో ఉంటానని తెలిపారు. కరోనాపై పోరాటానికి సంబంధించి ముఖ్యమంత్రులు ఎప్పుడైనా తనతో చర్చించవచ్చునని ప్రధాని చెప్పారు. సూచనలు తెలియజేవచ్చునని అన్నారు. తాను జాతినుద్దేశించి ప్రసంగించినప్పుడు లాక్‌డౌన్, సామాజిక దూరం అత్యంత కీలకమని చెప్పినట్టు గుర్తుచేశారు. ప్రతి పౌరుడి ప్రాణాలు కాపాడేందుకు ఇదే సమర్థవంతమైన మార్గమని వివరించానని చెప్పారు. తాను చేసిన సూచనలను దాదాపుగా అందరూ పాటించి ఇంటికి పరిమితమయ్యారని మోడీ అన్నారు.
Tags: pm video conference, cm’s, extension, lockdown, urged, modi, country, coronavirus