గల్ఫ్ దేశాల్లో 10 వేల మంది భారతీయులకు కరోనా

by  |
గల్ఫ్ దేశాల్లో 10 వేల మంది భారతీయులకు కరోనా
X

న్యూఢిల్లీ : కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. రోజురోజుకూ వైరస్ ఉధృతి పెరుగుతుండటంతో ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు. పశ్చిమాసియాలోని గల్ఫ్ దేశాల్లో ప్రతీరోజు భారీ సంఖ్యలో కొవిడ్-19 కేసులు నమోదవుతున్నాయి. ఉద్యోగ, వ్యాపారాల నిమిత్తం గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు కూడా ఈ వైరస్ బారిన పడుతున్నారు. ఇప్పటి వరకు గల్ఫ్ దేశాల్లోని 10 వేల మంది భారతీయులకు కరోనా సోకినట్లు అధికారులు వెల్లడించారు. అంతేకాకుండా ఇప్పటి వరకు 84 మంది భారతీయులు అక్కడ కరోనాతో చనిపోయినట్టు సమాచారం. బ్రిటన్‌లో కొవిడ్-19 కారణంగా మరణించిన భారతీయుల సంఖ్య.. ఇండియాలో చనిపోయిన వారి సంఖ్యను ఏనాడో దాటేసింది. కాగా, ఇండియాలో కంటే విదేశాల్లోని భారతీయులే ఈ వైరస్ కారణంగా ఎక్కువగా చనిపోతున్నారు. దీంతో స్వదేశానికి తిరిగొచ్చేందుకు లక్షలాది మంది భారతీయులు ఆసక్తి చూపుతున్నారు. కాగా, రాబోయే రోజుల్లో 14,800 మంది భారతీయులను ప్రత్యేక విమానాల ద్వారా స్వదేశానికి తీసుకొని రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది.

Tags: Gilf Countries, Coronavirus, Covid 19, Indians, Deaths, Positive

Next Story