- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బిగ్ బాస్ 15 -18.. అన్ని సీజన్లలోనూ ఆ హీరోయిన్.. ఎందుకంటే?
దిశ, సినిమా : బిగ్ బాస్ ఓటీటీ ఫేమ్ మూస్ జట్టానా హీరోయిన్ షమితా శెట్టిని టార్గెట్ చేస్తూ కామెంట్స్ చేసింది. బిగ్ బాస్ ఓటీటీలో సెకండ్ రన్నరప్‌గా నిలిచిన షమిత ‘బిగ్ బాస్ 15’లో పార్టిసిపేట్ చేయబోతుందని వార్తలు వస్తుండగా.. దీనిపై స్పందించిన మూస్ జట్టానా ట్విట్టర్‌లో వైరల్ అయిన ఓ ట్వీట్‌ను పోస్ట్ చేసింది. ‘బిగ్ బాస్ 16,17లో షమితా ఎంటర్ కాబోతోందని కన్‌ఫర్మ్ అయింది. ఈ రెండు సీజన్లలో కూడా విన్ కాకపోతే సీజన్ 18లోనూ ఉంటుంది’ అనేది ఆ ట్వీట్ సారాంశం. కాగా బిగ్ బాస్ 3లోనూ పాల్గొన్న షమితా శెట్టి, తన సోదరి శిల్పా శెట్టి – రాజ్ కుంద్రా మ్యారేజ్ నేపథ్యంలో మధ్యలోనే బిగ్ బాస్ హౌజ్ నుంచి బయటకు వచ్చేసింది.
కాగా ఈ పోస్ట్‌తో మూస్ జట్టానాపై ఫైర్ అయ్యారు షమితా ఫ్యాన్స్. దీంతో మరో పోస్ట్ పెట్టిన భామ.. ‘ముందుగా తను లేజీ అని, నీట్‌గా ఉండనని ట్రోల్ చేశారు. ఇప్పుడేమో నాకు మెచ్యూరిటీ లేదు, చదువుకోలేదు, జలస్ ఫీల్ అవుతున్నానని చెప్తున్నారు. సరేలే నేను ఈ ప్రపంచంలో ఉన్న ఒకే ఒక్క చెడ్డ వ్యక్తిని.. మీరు, మీ ఫేవరెట్ హీరోయిన్ షమితా గ్రేట్ కదా’ అని రిప్లై ఇచ్చింది.