- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
ప్రభుత్వ రంగ బ్యాంకులకు మూలధన సమస్యలు
దిశ, వెబ్‌డెస్క్: కొవిడ్-19 ప్రభావంతో మారటోరియం, ఎన్‌పీఏ (NPCA) ల కారణంగా ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో మూలధన సమస్యలు కొనసాగుతున్నాయి. రాబోయే రెండేళ్లలో ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో సుమారు రూ.1.9 లక్షల కోట్ల నుంచి రూ. 2.1 లక్షల కోట్ల మూలధన నిధులను చొప్పించాలని ప్రముఖ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ (Moody’s) అభిప్రాయపడింది. ప్రస్తుతం రైట్స్ ఇష్యూ, ఈక్విటీ కేపిటల్ మార్కెట్ నుంచి నిధులను సమీకరిస్తున్నప్పటికీ.. భవిష్యత్తులో కష్టమయ్యే సూచనలు కనిపిస్తున్నాయని మూడీస్ అంచనా వేసింది. కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రతరమైన పరిస్థితుల్లో భారత్ ఆర్థిక వృద్ధిలో మందగమనం ప్రభుత్వ రంగ బ్యాంకుల ఆస్తి నాణ్యతను దెబ్బతీస్తుంది.
ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో రుణ వ్యయాలను పెంచుతుంది. నాన్-పర్ఫార్మింగ్ లోన్లు(NPL) 2022, మార్చి నాటికి 14.5 శాతానికి పెరుగుతాయని అంచనాలున్నాయి. ప్రధానంగా రిటైల్, ఎంఎస్ఎంఈలే ఎన్‌పీఎల్‌లకు కారణమవుతాయని మూడీస్ చెబుతోంది. 70 శాతం ఎన్‌పీఎల్‌లకు రుణాల నష్టాలను అధిగమించేందుకు బ్యాంకులకు సుమారు రూ. లక్ష కోట్లు అవసరమని వెల్లడించింది. నిజానికి, కొవిడ్-19 రాకమునుపే ఆర్థిక వ్యవస్థ ఆరేళ్లుగా నెమ్మదించింది. కొవిడ్-19 తర్వాత ఇది మరింత దిగజారిందని, దీంతో బ్యాంకులు రానున్న రోజుల్లో ఎన్‌పీఏల విషయంలో క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కొనే అవకాశాలున్నాయని మూడీస్ తెలిపింది.