భారత వృద్ధి క్షీణించవచ్చు

by Shyam |
భారత వృద్ధి క్షీణించవచ్చు
X

దిశ, వెబ్‌డెస్క్: ప్రభుత్వ గణాంకాల శాఖ జీడీపీ (GDP) గణాంకాలను వెల్లడించిన తర్వాత ప్రముఖ రేటింగ్ ఏజెన్సీలన్నీ దేశ వృద్ధి అంచనాల్లో భారీగా కోతలను విధిస్తున్నాయి. ఇటీవల దేశీయ రేటింగ్ ఏజెన్సీ క్రిసిల్ (Crisil) భారత వృద్ధి రేటు (India’s growth rate)ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి 9 శాతం కుదించుకుపోతుందని అంచనా వేయగా, తాజాగా మరో రేటింగ్ సంస్థ మూడీస్ ( Moody’s)శుక్రవారం భారత ఆర్థిక వృద్ధి ఈ సంవత్సరంలో 11.5 శాతం కుదించుకుపోవచ్చని అంచనా వేసింది.

భారత క్రెడిట్ ప్రొఫైల్ (Indian Credit Profile) తక్కువ వృద్ధి, అధిక రుణ భారం, బలహీనమైన ఆర్థిక వ్యవస్థలో పరిమిత కార్యకలాపాల కారణంగా వృద్ధి క్షీణతను ప్రతికూలంగా అంచనా వేసినట్టు మూడీస్ ( Moody’s)పేర్కొంది. ఇదివరకే 2020-21 ఆర్థిక సంవత్సరానికి భారత జీడీపీ వృద్ధి (India’s growth rate) అంచనాలను తగ్గిస్తూ ఫిచ్, గోల్డ్‌మన్ శాచ్స్ వంటి గ్లోబల్ రేటింగ్, రీసెర్చ్ సంస్థలు ప్రకటించాయి.

ఫిచ్ రేటింగ్ (Fitch rating) ఇదివరకు అంచనా వేసిన 5 శాతాన్ని సవరిస్తూ 10.5 శాతం ప్రతికూలంగా అంచనాలను ప్రకటించగా, గోల్డ్‌మన్ శాచ్స్ (Goldman Sachs) ఏకంగా 14.8 శాతం కుదించుకుపోతుందని వెల్లడించింది. ఇదివరకు ఈ సంస్థ దేశ జీడీపీ వృద్ధి 11.8 శాతం ప్రతికూలంగా ఉండొచ్చని అంచనా వేసింది.

అదే సమయంలో, రాబోయే ఆర్థిక సంవత్సరంలో ఆర్థిక వ్యవస్థ పనితీరుపై అంచనాలను 8.7 శాతం నుంచి 10.6 శాతానికి సవరిస్తున్నట్టు మూడీస్ ( Moody’s) నివేదిక పేర్కొంది. వృద్ధి గణనీయంగా తగ్గడం వల్ల ప్రభుత్వ ఆదాయం బలహీనపడుతుంది. కరోనా వైరస్ వ్యాప్తి వల్ల ఆర్థిక వ్యయం (Financial cost) పెరిగి ద్రవ్యలోటు (Deficit)కు దోహదం చేస్తుందని మూడీస్ ( Moody’s) పేర్కొంది.

Advertisement

Next Story

Most Viewed