- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
కొత్త ఆసుపత్రులకు నో మనీ
దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా నిర్మించాలనుకుంటున్న ఆసుపత్రులకు కాసుల కష్టం ఏర్పడింది. కొత్త ప్రాజెక్టులోని 70 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో పనులు పెండింగ్ పడ్డాయి. వీటి నిర్మాణాలు, మౌలిక వసతులు, మ్యాన్‌పవర్‌ను సమకూర్చేందుకు సుమారు 180 కోట్లు అవసరం అవుతాయని, వాటిని వెంటనే విడుదల చేయాలని వైద్యశాఖ ప్రభుత్వాన్ని కోరింది. కానీ, ఇప్పటి వరకు ఆర్థిక శాఖ నుంచి ఎలాంటి క్లారిటీ రాలేదని ఆఫీసర్లు చెబుతున్నారు. దీంతోనే ఆసుపత్రుల నిర్మాణ పనులు మందగించినట్లు స్పష్టం చేశారు. దీంతో పాటు సిబ్బంది కొరత ఉన్నట్లు చెబుతున్నారు. వీటిలో పనిచేసేందుకు అన్ని విభాగాలు కలిపి 14,568 మంది అవసరం ఉండగా, ప్రస్తుతం 13,763 మంది మాత్రమే లభించినట్లు ఆఫీసర్లు వివరించారు. మరో 4,130 నియమించాల్సిన అవసరం ఉన్నదని చెప్పుకొచ్చారు. అయితే వీరిలో ప్రస్తుతానికి 3,325 మంది సిబ్బందిని నియమించాల్సిన అవసరం లేదని, కేవలం 805తో పాటు డీఎంహెచ్ఓ, డీపీహెచ్‌ఓ కార్యాలయాల్లో మరో 175 మందిని మాత్రం నియమిస్తే సరిపోతుందని సర్కార్ వైద్యశాఖకు సూచించినట్లు తెలిసింది.