- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
సోమవారం పంచాంగం, రాశిఫలాలు (17-05-2021)
ప్రదేశము : హైదరాబాద్ ,ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : ఉత్తరాయణం
మాసం : వైశాఖమాసం
ఋతువు : వసంత ఋతువు
కాలము : వేసవికాలం
వారము : సోమవారం
పక్షం : శుక్లపక్షం
తిథి : పంచమి
(నిన్న ఉదయం 10 గం॥ 0 ని॥ నుంచి
ఈరోజు ఉదయం 11 గం॥ 31 ని॥ వరకు)
నక్షత్రం : పునర్వసు
(నిన్న ఉదయం 11 గం॥ 13 ని॥ నుంచి
ఈరోజు మద్యాహ్నం 1 గం॥ 19 ని॥ వరకు)
యోగము : గండము
కరణం : బాలవ
వర్జ్యం : ( తెల్లవారుజాము 0 గం॥ 16 ని॥ నుంచి 2 గం॥ 0 ని॥ వరకు)(రాత్రి 9 గం॥ 50 ని॥ నుంచి రాత్రి 11 గం॥ 32 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఉదయం 10 గం॥ 42 ని॥ నుంచి 12 గం॥ 26 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఉదయం 12 గం॥ 37 ని॥ నుంచి మధ్యాహ్నం 1 గం॥ 28 ని॥ వరకు)(సాయంత్రం 3 గం॥ 13 ని॥ నుంచి 4 గం॥ 4 ని॥ వరకు)
రాహుకాలం : (ఉదయం 7 గం॥ 20 ని॥ నుంచి 8 గం॥ 57 ని॥ వరకు)
గుళికకాలం : (మధ్యాహ్నం 1 గం॥ 49 ని॥ నుంచి 3 గం॥ 26 ని॥ వరకు)
యమగండం : (ఉదయం 10 గం॥ 34 ని॥ నుంచి 12 గం॥ 11 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 43 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 41 ని॥ లకు
సూర్యరాశి : వృషభము
చంద్రరాశి : మిథునము
మేష రాశి : అవసరాలకు సరిపోయినంత ధనం లభిస్తుంది. ఉద్యోగంలో తగిన గుర్తింపు లభిస్తుంది. వ్యాపారంలో సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోండి. ఇతరులను మెప్పించడం కోసం ఏ పని చేయకండి. ఈ కరోనా సమయంలో ఇంతకు ముందే నిర్ణయం అయిన ప్రయాణాలు వాయిదా పడతాయి. కొత్త విషయాన్ని ప్రారంభించే ముందు ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. ఈ రాశి స్త్రీలకు మెతకవైఖరి కొంత ఇబ్బందులు తెచ్చి పెడుతుంది
వృషభ రాశి : ఆర్థిక ఇబ్బందులు మీ ప్రణాళికలను కుదురుకొనీ య్యవు. ఇతరుల సలహాలను ఆలోచించి పాటించండి మీకు విజయం. ఆకస్మిక గాయాలు అయ్యే అవకాశం జాగ్రత్తగా ఉండండి. దుర్వ్యసనాలు, స్నేహితులు ఈ రెండింటి తోటి జాగ్రత్త. వినోదాల కై ధనము వ్యయం చేస్తారు. ఈ రాశి స్త్రీలకు యోగా మెడిటేషన్ వల్ల లాభపడతారు
మిధున రాశి : దూరప్రయాణాలు ఆరోగ్యానికి మంచిది కాదు. మీ దూకుడు స్వభావం వల్ల మీరు అనుకున్నంతగా ధనము చేతికి అందక పోవచ్చు. ఉద్యోగంలో మార్పులు కై చేస్తున్న ప్రయత్నాలు ఫలిస్తాయి. ఏ విషయంలోనూ తొందర పడకండి. వ్యాపారంలో మీ అభిప్రాయాలను కుటుంబ సభ్యులు గౌరవిస్తారు. ఈ రాశి స్త్రీలకు భగవంతుని నమ్మండి ఆరాధించండి
కర్కాటక రాశి : ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. ఆదాయంతో పాటు ఖర్చులు పెరుగుతాయి. ధనాన్ని పొదుపు చేద్దాం అన్న మీ ప్రయత్నాలకు ఆటంకం కలిగినా చివరకు మీరే నెగ్గుతారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. వ్యాపారంలో క్రయవిక్రయాలలో మెలకువలు పాటించండి. ఈ రాశి స్త్రీలకు సమాజ సేవ పరంగా పేరు ప్రఖ్యాతులు లభిస్తాయి
సింహరాశి : కుటుంబ సభ్యులతో మిత్ర భావంతో సంభాషించండి లేకపోతే అనుకోని అపార్ధాలు వస్తాయి. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. పెట్టుబడులను తెలివిగా పెట్టండి. ఆరోగ్య సమస్యలు లేవు. మీ జీవిత భాగస్వామి ప్రవర్తన వల్ల ఆనందం. ఈ రాశి స్త్రీలకు తల్లి వైపు బంధువులకు కొంతకాలం అండగా ఉండవలసిన పరిస్థితి
తులారాశి : ఆర్థిక పరిస్థితి మరింత మెరుగు పడుతుంది. ఉద్యోగ వ్యాపారాలలో గౌరవం పెరుగుతుంది. ఇంతకు ముందు తీసుకున్న రుణాలు మిమ్మల్ని చికాకు పెడతాయి. వ్యాపారంలో రాజీ ధోరణి మరియు మీ తెలివితేటలు మీకు లాభాలను తెచ్చి పెడతాయి. ఉద్యోగంలో అవాంతరాలు అధిగమిస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ పిల్లలను మందలించే టప్పుడు వారిని పరుషంగా దూషించకండి.
కన్య రాశి : నా కష్టాన్ని ఎవరూ గుర్తించడం లేదు అనుకునే మీ ప్రవర్తనను మార్చుకోండి. మీ మనోబలం మిమ్మల్ని ముందుకు నడిపిస్తుంది. విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. మీ కుటుంబ సభ్యుల మరియు జీవిత భాగస్వామి ప్రవర్తన మిమ్మల్ని ఆనందానికి గురి చేస్తుంది. ఈ రాశి స్త్రీలకు మీ మనోధైర్యం మిమ్మల్ని చాలా విషయాలలో రక్షిస్తుంది.
వృశ్చిక రాశి : కుటుంబ సభ్యులతో కలిసి సామాజిక సేవలో పాల్గొంటారు. ఉద్యోగంలో మీ మనసుకు నచ్చిన వారి సహాయం తీసుకోండి. వారి సహాయం మీకు ఎంతో మేలు చేస్తుంది స్థిరాస్తుల అమ్మకమునకు ఇది సరైన తరుణం. ఈ కరోనా ఈ సమయంలో ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉన్నా అవసరాలు తీరుతాయి. ఈ రాశి స్త్రీలకు ఆర్థిక పరమైన ఒడిదుడుకులు పెద్దగా ప్రభావం చూపించవు.
ధనుస్సు రాశి : ఒత్తిడికి లోనవకండి. ముఖ్యంగా మీ కోపాన్ని పూర్తిగా అదుపులో ఉంచుకోండి లేకపోతే కష్టాలు ఎదుర్కోవలసి వస్తుంది. ఈ కరోనా సమయంలో కూడా వ్యాపారం లాభసాటిగా సాగుతుంది. నూతన పెట్టుబడుల విషయంలో సరైన సలహా స్వీకరించండి. ఈ రాశి స్త్రీలకు జీవిత భాగస్వామితో విభేదాలు వస్తాయి.
మకర రాశి : ఏ పనినైనా అవలీలగా అత్యంత ఉత్సాహంతో సమర్థవంతంగా చేస్తారు. జీవిత భాగస్వామి ప్రవర్తన నచ్చకపోయినా వారిని సాధించకండి. కొన్ని సమస్యలు తీరి ఊపిరి పీల్చుకుంటారు. మీ ఎమోషన్స్ ను కంట్రోల్ చేసుకో లేకపోతే అందరూ మిమ్మల్ని వదిలేసి వెళ్తారు. వ్యాపారంలో తగినంత లాభం రావాలంటే శ్రమా శ్రద్ధ రెండూ ఉంచండి. ఈ రాశి స్త్రీలకు వాస్తవాలను నమ్మించడానికి అధికంగా శ్రమపడాల్సి ఉంటుంది.
కుంభరాశి : ఆర్థిక ఆదాయం చాలా బాగుంటుంది. పొరపాట్లు సరిదిద్దుకొని అనుకున్న వ్యవహారాలు చక్కదిద్దారు. జీవిత భాగస్వామితో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ వ్యాపారాలలో బుద్ధిబలంతో పని చేయండి. సమస్యలను అవలీలగా అధిగమిస్తారు. ఈ రాశి స్త్రీలకు లాభాలు వచ్చే అంశాలలో ధనాన్ని పొదుపు చేస్తారు లేక పెట్టుబడిగా పెడతారు.
మీన రాశి : ఆధ్యాత్మిక పుస్తకాలు చదవటం వలన మరియు ఇష్ట దైవ స్మరణ తో సమస్యలను అధిగమిస్తారు. ఇతరుల నిందలతో కాలయాపన చేసి ఆరోగ్యాన్ని పాడు చేసుకోకండి. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడి మీకు లాభాలను తీసుకు రాబోతోంది. పనులు పూర్తి అయ్యేవరకు, కొలిక్కి వచ్చే వరకు మీ మనసులో మాట బయట పెట్టవద్దు. ఈ రాశి స్త్రీలకు మీ ఆత్మ గౌరవాన్ని కాపాడుకోవడానికి అన్నివిధాలుగా ప్రయత్నిస్తారు.