ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు

by Hamsa |   ( Updated:2021-08-01 12:00:51.0  )
ఈ రాశి వారు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు
X

ప్రదేశము : హైదరాబాద్, ఇండియా
సంవత్సరం : ప్లవనామ సంవత్సరం
ఆయనం : దక్షిణాయణం
మాసం : ఆషాఢమాసం
ఋతువు : గ్రీష్మ ఋతువు
వారము : సోమవారం
పక్షం : కృష్ణ (బహుళ) పక్షం
తిథి : నవమి (నిన్న ఉదయం 7 గం॥ 58 ని॥ నుంచి ఈరోజు ఉదయం 10 గం॥ 28 ని॥ వరకు)
నక్షత్రం : కృత్తిక (నిన్న రాత్రి 7 గం॥ 38 ని॥ నుంచి ఈరోజు రాత్రి 10 గం॥ 43 ని॥ వరకు)
యోగము : వృద్ధి
కరణం : గరజ
వర్జ్యం : (ఈరోజు ఉదయం 9 గం॥ 10 ని॥ నుంచి 10 గం॥ 58 ని॥ వరకు)
అమ్రుతఘడియలు : (ఈరోజు రాత్రి 8 గం॥ 0 ని॥ నుంచి రాత్రి 9 గం॥ 48 ని॥ వరకు)
దుర్ముహూర్తం : (ఈరోజు మధ్యాహ్నం 12 గం॥ 47 ని॥ నుంచి 1 గం॥ 38 ని॥ వరకు)(ఈరోజు మధ్యాహ్నం 3 గం॥ 22 ని॥ నుంచి సాయంత్రం 4 గం॥ 13 ని॥ వరకు)
రాహుకాలం : (ఈరోజు ఉదయం 7 గం॥ 31 ని॥ నుంచి ఉదయం 9 గం॥ 7 ని॥ వరకు)
గుళికకాలం : (ఈరోజు మధ్యాహ్నం 1 గం॥ 58 ని॥ నుంచి 3 గం॥ 34 ని॥ వరకు)
యమగండం : (ఈరోజు ఉదయం 10 గం॥ 45 ని॥ నుంచి మధ్యాహ్నం 12 గం॥ 21 ని॥ వరకు)
సూర్యోదయం : ఉదయం 5 గం॥ 55 ని॥ లకు
సూర్యాస్తమయం : సాయంత్రం 6 గం॥ 49 ని॥ లకు
సూర్యరాశి : కర్కాటకము
చంద్రరాశి : వృషభము

మేష రాశి : దైవ స్తోత్రం వలన మానసిక ప్రశాంతత. దానివలన పాజిటివ్ ఆలోచనలు వస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. మీ దుబారా ఖర్చు వలన భవిష్యత్తులో డబ్బుకు ఇబ్బంది కలగే పరిస్థితుల గురించి ఈరోజు తెలుసుకుంటారు. నూతన పెట్టుబడులు పై ఒకటికి రెండు సార్లు ఆలోచించండి. నూతన వ్యక్తుల పరిచయం స్నేహంగా మారుతుంది. తోటి ఉద్యోగులతో సామరస్యంగా ప్రవర్తించండి. ఆఫీస్ పనులను సకాలంలో పూర్తి చేయడానికి సరైన ప్రణాళిక వేయండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఆనందకరమైన రోజు.

మిథున రాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు వ్యాపారులకు లాభాలు. వ్యాపార విస్తరణకు నూతన పెట్టుబడులు పెడతారు. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కొంతమందికి విదేశీ ప్రయాణ అవకాశం. కొంత మంది స్థిరాస్తి కొనుగోలు ప్రయత్నాలు చేస్తారు. ఆఫీసు పనులు సకాలంలో పూర్తి చేస్తారు అందరి ప్రశంసలు పొందుతారు. తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. విద్యార్థులు చదువు మీద శ్రద్ధ పెట్టండి సమయాన్ని వృధా చేయకండి ఆదాయం కన్నా ఖర్చు ఎక్కువ బయట తిండి వలన అజీర్తి. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు.

వృషభ రాశి : ఆశావహ దృక్పథంతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. మీ చేతికి అందినదే మీకు భగవంతుడు ఇచ్చినది. బ్యాంకు ఉద్యోగులకు కొంతమందికి ప్రమోషన్ కొంతమందికి ట్రాన్స్ఫర్. ఆఫీసు పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి అనవసరపు ఖర్చులను నివారించండి. కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి. మీ కోపాన్ని నియంత్రణలో ఉంచుకోండి. స్థిరాస్తి వ్యవహారాలలో మీ సొంత నిర్ణయం తీసుకోండి. బయటి తిండి వలన అజీర్తి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు పాత విషయాలను మర్చిపోయి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కర్కాటక రాశి : కలలు కనడం కాదు వాటిని నిజం చేసుకోవటానికి కష్టపడి ప్రయత్నించండి. విద్యార్థులు సమయాన్ని వృధా చేయకండి చదువు మీద శ్రద్ధ పెట్టండి. మీ శ్రమకు తగిన ఫలితం దక్కాలంటే మరింత కష్టపడాలి సాఫ్ట్ వేర్ ఉద్యోగులకు జీతాలు పెరిగే అవకాశం. వ్యాపారులకు లాభాలు. ఆదాయం బాగుంది అనవసరపు ఖర్చులను నివారించండి. ఆఫీసులో పనులను శ్రద్ధ పెట్టి పెండింగ్ లేకుండా తప్పులు లేకుండా పూర్తి చేయడానికి ప్రయత్నించండి. ఒత్తిడిని అధిగమించడానికి ప్రయత్నించండి లేకుంటే ఆరోగ్య సమస్యలు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తల సామరస్య ధోరణి వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

సింహరాశి : కుటుంబ సభ్యులతో మనసు విప్పి మాట్లాడండి అపార్ధాలు తొలగిపోతాయి. స్థిరాస్థి కొనుగోలు లో మీకు కావలసిన ధర వచ్చేందుకు మరికొంత కాలం వేచి ఉండండి. ఆదాయ వ్యవహారాలు మరింత మెరుగు పడతాయి. మీ చిరకాల వాంఛ నెరవేరుతుంది. వ్యాపారులు తమ టాక్స్ వ్యవహారాలలో జాగ్రత్తగా ఉండండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి పై అధికారులు గమనిస్తున్నారు. ఇతరులను మెప్పించడానికి, ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈరోజు మీ వైవాహిక జీవితంలోని మాధుర్యాన్ని అనుభవిస్తారు.

కన్యారాశి : కొత్తగా వ్యాపారం ప్రారంభించేవారు అనుకునేవారు తొందరపడకండి. అన్ని రకాలుగా అన్ని విషయాలను సేకరించి నిర్ణయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి వారితో గడపటం మీకెంతో ఎనర్జీ. స్థిరాస్తి కొనుగోలు లో ధర మిమ్మల్ని ఊరిస్తుంది ధైర్యంగా నిర్ణయం తీసుకోండి. నిరుద్యోగులకు మీరు ప్రయత్నిస్తున్న ఉద్యోగం రాకపోయినా వేరే ఉద్యోగం వస్తుంది. ఆదాయం బాగుంది పాత బకాయిలు వసూలవుతాయి బ్యాంక్ బ్యాలెన్స్ పెరుగుతుంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి. నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

తులారాశి : సహనంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. తొందరపాటు వలన గందరగోళం. దైవప్రార్థన వలన మానసిక బలం దానివలన పాజిటివ్ ఆలోచనలు. ఆఫీసులో అదనపు బాధ్యతలు. అధిక సామర్థ్యంతో పనులను పూర్తి చేస్తారు పై అధికారుల ప్రశంసలు. ఆదాయం బాగున్నా అనవసరపు ఖర్చుల వలన డబ్బుకు ఇబ్బంది. ఆరోగ్యంపట్ల జాగ్రత్త వహించండి ముఖ్యంగా గుండెజబ్బు ఉన్నవాళ్ళు. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి.

వృశ్చిక రాశి : ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొత్తగా భాగస్వామ్య వ్యాపారం చేద్దామనుకునే వారికి మంచి తరుణం. ఆఫీసులో తోటి ఉద్యోగుల సీనియర్ల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆరోగ్యపరంగా ఎటువంటి ఇబ్బంది లేదు. ఆదాయం బాగుంది ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు. కుటుంబ అవసరాల కోసం ఖర్చు పెడతారు. వాహనాలు నడిపేటప్పుడు జాగ్రత్త. కొంతమంది స్థిరాస్తి వ్యవహారాలలో కోర్టుకు వెళతారు. మీ కోసం మీ అభిరుచులు కోసం కొంత సమయం కేటాయించుకోండి. ఈ రాశి స్త్రీలకు మీ భార్యాభర్తలు ఒకరి మీద ఒకరు నమ్మకం పెంచుకోండి నమ్మకమే మీ వైవాహిక జీవితానికి పునాది.

ధనుస్సు రాశి : అన్నివిధాలా అనుకూలమైన రోజు. ఆత్మవిశ్వాసంతో పట్టుదలతో అనుకున్న కార్యాలను సాధిస్తారు. కొంతమందికి జీతాలు పెరుగుదల. కొంతమంది ఉద్యోగ మార్పుపై ప్రయత్నాలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు. కుటుంబ సభ్యులతో కొంత సమయం గడపండి మీ పెద్ద వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించండి. స్థిరాస్తి కొనుగోలుకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. ఫిట్ నెస్ కొరకు చేస్తున్న ప్రయత్నాలు సఫలం. కావలసినంత ధనం చేతికందుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త మీకు ఒక ఆశ్చర్యకరమైన గిఫ్ట్ ఇవ్వబోతున్నారు ఆనందించండి.

మకర రాశి : లాభాల కోసం సరైన పథకాల్లో పెట్టుబడులు పెట్టండి. గందరగోళంలో సరైన నిర్ణయాలు తీసుకోలేరు. దైవ ప్రార్ధన వలన మానసిక బలం దానివలన పాజిటివ్ ఆలోచనలు. వ్యాపారులు తొందరపాటు నిర్ణయాలు తీసుకోకండి. కుటుంబ సభ్యులకు కొంత సమయం కేటాయించండి ముఖ్యంగా మీ పిల్లలతో గడపడం మీకు ఎంతో ఎనర్జీ. ఆదాయ వ్యవహారాలు మెరుగుపడతాయి. ఆడంబరాల కోసం ఖర్చు పెట్టకండి. ఆఫీసు పనులలో అధిక శ్రమ. పనులను సకాలంలో పూర్తి చేయాలంటే సరైన ప్రణాళిక తప్పనిసరి. ఈ రాశి స్త్రీలకు మీ భార్య భర్తలు ప్రతి చిన్న విషయానికి గొడవ పడటం మానేసి మీ వైవాహిక జీవితంలో ఒక ఆనందకరమైన రోజు గడపండి.

కుంభరాశి : కుటుంబ సభ్యులతో పరుషంగా మాట్లాడకండి ముఖ్యంగా మీ పెద్ద వారితో సామరస్యంగా ప్రవర్తించండి. పెళ్లి కాని వారికి మంచి సంబంధం కుదిరి అవకాశం. ఉద్యోగం మార్పుకై ప్రయత్నాలు చేస్తున్న వారి ప్రయత్నాలు సఫలం. ఇంతకు ముందు పెట్టిన పెట్టుబడుల ద్వారా లాభాలు. అవసరాలకు మాత్రమే ఖర్చు పెట్టండి. కొత్తగా ఏదైనా ప్రాజెక్టు ప్రారంభించే ముందు అదే ఫీల్డులో ఉన్న అనుభవజ్ఞుల సలహా తీసుకోండి. మానసిక శారీరక ఆరోగ్యం కోసం యోగా మెడిటేషన్ చేయండి. ఆరోగ్యం పూర్తిగా మెరుగు పడుతుంది. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

మీన రాశి : కొంతమందికి విదేశీ ప్రయాణం అవకాశం. ఆఫీసు పనుల్లో అధిక శ్రమ మరింత కష్టపడి పనులను సకాలంలో పూర్తి చేయటానికి ప్రయత్నించండి పెండింగ్ పెట్టకండి. భాగస్వామ్య వ్యాపారాలలో లాభాలు. కుటుంబ సభ్యులతో ఆనందంగా గడుపుతారు ముఖ్యంగా తోబుట్టువుల సహాయ సహకారాలు లభిస్తాయి. ఆదాయం బాగుంది. ఆరోగ్యంగా ఉండాలంటే సరైన తిండి సరైన నిద్ర అవసరం. సామాజిక కార్యక్రమాలలో పాల్గొంటారు దానధర్మాలు చేస్తారు. ఈ రాశి స్త్రీలకు మీ భర్త యొక్క ప్రవర్తన వలన ఈ రోజు మీ వైవాహిక జీవితంలో ఒక తీపి గుర్తు.

Advertisement

Next Story

Most Viewed