నిమిషానికి రూ.5లక్షలు తీసుకున్న మోనాల్

by Anukaran |   ( Updated:2020-12-30 06:35:29.0  )
నిమిషానికి రూ.5లక్షలు తీసుకున్న మోనాల్
X

దిశ, వెబ్‌డెస్క్ : దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలనే నానుడిని నిజం చేస్తున్నారు టాలీవుడ్ భామలు. ఆఫర్లు దండిగా వచ్చినప్పుడే అందినకాడికి దండుకోవాలని చూస్తున్నారు. నిడివి ఎంతైనా నిర్మాతల నుంచి రూ.లక్షలు పిండుకుంటున్నారు. ఇండస్ట్రీలో కాస్త గుర్తింపు వచ్చిన వాళ్లు కూడా ఇదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. టాలీవుడ్‌లో రెండు, మూడు సినిమాలు చేసి కనుమరుగైన హీరోయిన్ మోనాల్ గజ్జర్. బిగ్‌బాస్ షోతో మళ్లీ ఫామ్ లోకి వచ్చిన ఈ గుజరాతీ భామ.. తనకు వస్తున్న ఆఫర్లను కాసుల మూఠలుగా మార్చుకునే ప్రయత్నం చేస్తోంది.

మోనాల్ గజ్జర్.. తెలుగు ఇండస్ట్రీకి సుడిగాడు సినిమాతో పరిచయమైన గుజరాతీ ఈ ముద్దుగుమ్మ. ఆ సినిమా బ్లాక్‌బస్టర్ అయినా సరైన ఆఫర్లు రాలేదు. టాలీవుడ్‌ను వదిలి తమిళ, మలయాళ ఇండస్ట్రీలకు వలస వెళ్లినా అక్కడ గుర్తింపు రాలేదు. మళ్లీ తెలుగులోకి వచ్చిన మోనాల్.. అల్లరి నరేష్ సరసాన బ్రదర్ ఆఫ్ బొమ్మాళిలో నటించి తెలుగు తెరకు పూర్తిగా దూరమైంది. బిగ్ బాస్ షోతో మళ్లీ ఆఫర్లు దక్కించుకుంటున్న ఈ భామ రెమ్యునరేషన్ భారీగా డిమాండ్ చేస్తోందని ఫిల్మ్ వర్గాల టాక్.

బెల్లంకొండ శ్రీనివాస్ హీరోగా నటిస్తున్న ‘అల్లుడు అదుర్స్’ సినిమాలో ఓ ఐటెం సాంగ్ ఆఫర్ వచ్చిందీ భామకు. మూడు నిమిషాలు ఉన్న ఆ సాంగ్ కోసం మోనాల్ ఏకంగా రూ.15 లక్షలు డిమాండ్ చేసిందట. అయినా ఆమెకు ప్రస్తుతం ఉన్న క్రేజీతో అడిగినంత సమర్పించడానికి నిర్మాత ఓకే చెప్పాడని టాలీవుడ్ టాక్.

Advertisement

Next Story

Most Viewed