అక్కాచెల్లెళ్ల అత్యాచారం కేసులో ఐదుగురికి జీవిత‌ ఖైదు

by Sumithra |
mahabub nagar crime news
X

దిశ‌, ఎల్బీన‌గ‌ర్: అక్కా చెల్లెళ్లపై అత్యాచారం కేసులో రంగారెడ్డి జిల్లా కోర్టు ఐదుగురిని దోషులుగా తేల్చింది. వారికి జీవిత‌ఖైదు విధిస్తూ తీర్పు నిచ్చింది. బుధ‌వారం రంగారెడ్డి జిల్లా మెట్రో పాలిట‌న్ స్పెష‌ల్ కోర్టు న్యాయ‌మూర్తి జ‌స్టిస్ సురేష్ ఈ తీర్పును వెలువ‌రించారు. మైలార్‌దేవ్‌పల్లిలో 2016 న‌వంబ‌ర్ 3న ఇద్దరు బాలిక‌ల‌పై అత్యాచారం జ‌రిగింది. క‌వ‌ల పిల్లలైన ఇద్దరు అక్కా చెల్లెళ్ల వ‌య‌స్సు అప్పుడు 9 ఏళ్లు. బాలిక‌ల త‌ల్లే విటుల ద‌గ్గర డ‌బ్బులు తీసుకొని త‌న కూతుళ్ల ద‌గ్గరికి పంపించేది. ఈ వ్యవహారంపై చుట్టుప‌క్కల వారికి అనుమానం వ‌చ్చి పోలీసుల‌కు స‌మాచారం ఇచ్చారు. మైన‌ర్ బాలిక‌లు ఇచ్చిన స‌మాచారం ఆధారంగా త‌ల్లితో పాటు 8 మందిపై కేసు న‌మోదు చేశారు. ఈ కేసులో ముగ్గురు మైన‌ర్లు కూడా ఉన్నారు. మైన‌ర్లకు సంబంధించిన కేసు ప్రస్తుతం బాల నేర‌స్తుల న్యాయ‌స్థానంలో కొన‌సాగుతోంది. మిగతా ఐదు మందికి సంబంధించిన కేసులో మైలార్‌దేవ్‌ప‌ల్లి పోలీసులు ప‌క్కా ఆధారాలు, సాక్ష్యాలు సేక‌రించి న్యాయ స్థానంలో స‌మ‌ర్పించారు. దీంతో నిందితుల‌కు ఎట్టకేలకు శిక్ష ప‌డింది. ఈ సంద‌ర్భంగా శంషాబాద్ డీసీపీ ప్రకాష్‌రెడ్డి, కేసు ద‌ర్యాప్తు అధికారులు ఇందిర‌, అనురాధ‌, అద‌న‌పు ప‌బ్లిక్ ప్రాసిక్యూట‌ర్ రాజిరెడ్డిల‌ను సైబ‌రాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ స‌జ్జనార్ అభినందించారు.

Advertisement

Next Story

Most Viewed