దుర్గమ్మ సేవలో సామాజిక కార్యకర్త మహమ్మద్ ఫసీ

by Shyam |
దుర్గమ్మ సేవలో సామాజిక కార్యకర్త మహమ్మద్ ఫసీ
X

దిశ, డైనమిక్ బ్యూరో: దేవీ నవరాత్రుల్లో భాగంగా వరంగల్ జిల్లాలోని రంగశాయిపేటలో ఓ వినూత్న ఘటన జరిగింది. స్థానికంగా ఉన్న రామాలయంలో శ్రీరామ భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీ దేవి శరన్నవారాత్రుల మహోత్సవాలలో ముస్లీం మత యువకుడు, సామాజిక కార్యకర్త ఎండీ ఫసీ అమ్మవారి సేవలో పూజలు నిర్వహించారు. శుక్రవారం జరిగిన కుంకుమ పూజ, మహా అన్నదాన కార్యక్రమంలో ఫసీ పాల్గొన్నారు. దుర్గామాత సేవలో పాల్గొని మతసామరస్యాన్ని చాటుకున్న ఫసీని అందరూ అభినందిస్తున్నారు. అయితే, ఫసీ వరంగల్ నగరంలో ఉన్న సమస్యలపై తన గలం వినిపిస్తుంటారు.

Next Story