- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- దిశ స్పెషల్స్
- స్పోర్ట్స్
- సినిమా
- లైఫ్ స్టైల్
- వైరల్ / ట్రెండింగ్
- బిజినెస్
- జాతీయం-అంతర్జాతీయం
- క్రైమ్
- భక్తి
- ఎడిట్ పేజీ
- జిల్లా వార్తలు
ఇదుక్కి ఘటన బాధాకరం: మోడీ
by Shamantha N |

X
దిశ, వెబ్‌డెస్క్: కేరళలో కురుస్తున్న భారీ వర్షాలకు కొండచరియలు విరిగిపడి ఇదుక్కి జిల్లా రాజమలైలో పలువురు మృతి చెందిన విషయం తెలిసిందే. పదుల సంఖ్యల్లో బాధితులు గల్లంతు అయ్యారు. ఈ ఘటనపై ప్రధాని నరేంద్ర మోడీ తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ దారుణం జరగడం దురదృష్టకరమన్నారు.
ఈ ప్రమాదంలో ఇప్పటివరకు పలువురు ప్రాణనష్టానికి గురయ్యారని.. బాధిత కుటుంబాలు శోకసంద్రంలో ఉన్నారని మోదీ తెలిపారు. సంఘటనా స్థలాల్లో ఎన్డీఆర్ఎఫ్ బృందాలు సహాయక చర్యలు చేపట్టాయని గుర్తు చేశారు. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని మోదీ ఆకాంక్షించారు. ఈ నేపథ్యంలోనే పీఎంవో కార్యలయం నుంచి ప్రధాన మంత్రి జాతీయ ఉపశమన నిధి కింద(పిఎమ్ఎన్ఆర్ఎఫ్) మృతుల కుటుంబాలకు రూ. 2 లక్షలు, గాయపడ్డవారికి రూ. 50 వేలు నష్ట పరిహారం ప్రకటించింది.
Next Story