కోతుల్లో సత్ఫలితాలిచ్చిన మొడెర్నా

by Shamantha N |
కోతుల్లో సత్ఫలితాలిచ్చిన మొడెర్నా
X

లండన్: అమెరికా సంస్థ మొడెర్నా అభివృద్ధి చేస్తున్న టీకాకు సంబంధించిన మరింత ఆశాజనక విషయం వెల్లడైంది. ఈ టీకా కోతులకు ప్రయోగించినప్పుడు వాటిలో ఊపిరితిత్తులకు సంబంధించిన సమస్యను నివారించిందని, వైరల్ ఇన్ఫెక్షన్‌ను సమర్థవంతంగా అడ్డుకున్నదని ఆ సంస్థ న్యూ ఇంగ్లాండ్ జర్నల్ ఆఫ్ మెడిసిన్‌లో ప్రచురించిన అధ్యయనంలో వెల్లడించింది.

రేసస్ మెకాక్ కోతుల్లో ఈ టీకా సమర్థంగా పనిచేసిందని, ఇమ్యూన్ రెస్పాన్స్‌ను ప్రేరేపించిందని తెలిపింది. ఊపిరితిత్తులు, ముక్కులో ఇన్ఫెక్షన్‌ను నిలువరించిందని, వైరస్ అభివృద్ధి చెందకుండా అడ్డుకున్నదని వివరించింది. 24 కోతులకు పది మైక్రోగ్రాములు, 100 మైక్రోగ్రాముల మోతాదులో టీకా అందించగా, రెండు డోసుల్లోనూ ఆశాజనక ఫలితాలు వచ్చాయని తెలిపింది. మనుషులపై ప్రయోగాలు చేస్తున్న ఈ సంస్థ తాజా ప్రకటనలతో టీకాపై అంచనాలు పెరిగాయి. థర్డ్ ఫేజ్ ట్రయల్స్‌లో భాగంగా 30వేల మందికి ఈ టీకాను ప్రయోగిస్తున్న సంగతి తెలిసిందే.

Advertisement

Next Story