- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మున్సిపాలిటీల్లో మోడల్ మార్కెట్లు : సబితారెడ్డి
రాష్ట్రంలోని ప్రతి మున్సిపాలిటీలో సమీకృత మోడల్ మార్కెట్ నిర్మాణం చేపట్టాలని ప్రభుత్వం నిర్ణయించిందని మంత్రి సబితా ఇంద్రారెడ్డి తెలిపారు. పట్టణ ప్రగతి అమలు సన్నాహక సమావేశంలో ఎమ్మెల్యేలు ప్రకాష్‌గౌడ్, మంచిరెడ్డి కిషన్ రెడ్డి, అంజయ్య యాదవ్, కాలే యాదయ్య, జిల్లా కలెక్టర్ అమోయ్ కుమార్, జిల్లాలోని మున్సిపల్ మేయర్లు, ఉప మేయర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ లు, కార్పొరేటర్లు, కౌన్సిలర్లు పాల్గొన్న ఈ సమావేశంలో మంత్రి సబితా ఇంద్రారెడ్డి మాట్లాడుతూ… ప్రతీ నగరంలో నాణ్యమైన, పరిశుభ్రమైన కూరగాయలు, పండ్లు, నాన్ వెజ్ ఆహార పదార్థాలను ఒకే ప్రాంతంలో అందించేందుకు ఇంటిగ్రేటెడ్ మార్కెట్ల నిర్మాణానికి ప్రతీ మున్సిపల్ కేంద్రంలో ఒక ఎకరం స్థలాన్ని యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలని అధికారులను ఆదేశించినట్టు వెల్లడించారు. రాష్ట్రంలోని అన్ని మున్సిపాలిటీలు, కార్పొరేషన్లకు ప్రతీ నెలా రూ.148 కోట్లు విడుదల చేస్తున్నట్టు ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రకటించారని, దీనివల్ల మున్సిపాలిటీలకు నిధుల కొరత ఉండదని స్పష్టం చేశారు. ఈనెల 24వ తేదీ నుంచి మార్చి 4వ తేదీ వరకు నిర్వహించే పట్టణ ప్రగతి ఈ కార్యక్రమంలో స్థానికులు పెద్ద ఎత్తున భాగస్వామ్యం చేసేందుకు వార్డుల వారీగా యువకులు, మహిళలు విద్యావంతులు, సీనియర్ సిటిజన్లు 60మందితో కమిటీలు వేయాలని మంత్రి సూచించారు. రాష్ట్రంలోని మున్సిపాలిటీలకు ప్రతి సంవత్సరం రూ.800 కోట్ల రూపాయలను ప్రభుత్వం నిధులను మంజూరు చేస్తుందని దీనిలో భాగంగా ఒక్క రంగారెడ్డి జిల్లాలోని మున్సిపాలిటీలకు రూ.130 కోట్లు నిధులు వస్తాయని వెల్లడించారు. తమ బడ్జెట్లో 10 శాతం నిధులను హరితహారానికి కేటాయించాలని స్పష్టం చేశారు. పట్టణ ప్రగతి కార్యక్రమంతో పాటు అభివృద్ధి కార్యక్రమాల అమలులో అలసత్వం వహించే చైర్మన్లు, కౌన్సిలర్లను తొలగించే అవకాశం కలెక్టర్లకు కల్పిస్తూ నూతన మున్సిపల్ చట్టంలో మార్పులు తెచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. వార్డుల వారీగా స్వచ్ఛ కార్యక్రమాల నిర్వహణపై ప్రత్యేక ప్రణాళిక రూపొందించుకోవాలని, ప్రధానంగా తడి, పొడి చెత్తను వేర్వేరుగా అందించేందుకు స్థానికులకు చైతన్యపరిచే బాధ్యత ప్రజా ప్రతినిధులదే అన్నారు.