- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
స్మార్ట్‌ఫోన్ ధరలకు రెక్కలు!
దిశ, వెబ్‌డెస్క్: వచ్చే నెల నుంచి స్మార్ట్‌ఫోన్‌లు మండనున్నాయి. అయితే, ఎండల వల్ల కాదు ధరల ధాటికి. ఏప్రిల్ 1 నుంచి స్మార్ట్‌ఫొన్‌ను, ఎంపిక చేసిన విడిభాగాలపై జీఎస్టీని 12 శాతం నుంచి 18 శాతానికి పెంచనున్నట్టు కేంద్ర స్పష్టం చేసింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ జీఎస్టీ మండలి సమావేశంలో కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. దీనికి సంబంధించి మండలి నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
ఎయిర్‌క్రాఫ్ట్‌లకు చెందిన రిపేర్ వంటి అన్ని సేవలకు సంబంధించి 18 శాతంగా జీఎస్టీని 5 శాతానికి తగ్గించారు. యంత్రాలతోనూ, చేత్తో చేసిన అగ్గిపుల్లలపై జీఎస్టీని 12 శాతంగా నిర్ణయించారు. వీటితో పాటు 2018,2019 ఆర్థిక సంవత్సరాలకు సంబంధించిన వార్షిక టర్నోవర్లపై ఆలస్యంగా దాఖలు చేసిన రిటర్నుల ఆలస్య రుసుములను రద్దు చేస్తున్నట్లు ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వివరించారు. జీఎస్టీ నెట్‌వర్క్ సామర్థ్యాన్ని పెంచేవిధంగా ఇన్ఫోసిస్‌కు నైపుణ్యం ఉన్న మానవ వనరులను సమకూర్చాలంటూ సూచించడం జరిగింది. మరో మూడు నెలల్లో జీఎస్టీ నెట్‌వర్క్‌ను మెరుగు పరచాలని ఆర్థిక మంత్రి తెలిపారు.
Tags: Gst Meeting, Gst Council Meeting, Gst Council Meeting In Delhi, Gst Council, Gst Council Meet, FM Sitharaman, Nirmala Sitharaman