- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
‘సుప్రీంకోర్టు తీర్పును స్వాగతిస్తున్నాం’
దిశ ప్రతినిధి, నిజామాబాద్: ఎస్సీ వర్గీకరణ చట్టంపై దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చిన నేపథ్యంలో రానున్న పార్లమెంట్ సమావేశాల్లో వర్గీకరణ బిల్లును ఆమోదించాలని ఎమ్మార్పీఎస్ నాయకులు వంగపల్లి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం నిజామాబాద్ జిల్లా కేంద్రంలో ఎమ్మార్పీఎస్ జిల్లా కార్యకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో వంగపల్లి పాల్గొని మాట్లాడుతూ…
ఎస్సీ వర్గీకరణ విషయంలో ఉషా మెహ్ర కమిషన్ తీర్పును పునఃసమీక్ష చేయాలని, అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును స్వాగతిస్తున్నామని అన్నారు. తెలంగాణ ప్రభుత్వం వర్గీకరణ బిల్లును ఆమోదం తెలిపిన విధంగానే మిగతా రాష్ట్రాలూ అదే బాటలో నడవాలని కోరారు. కేసీఆర్ ఉద్యమకారుడిగా తెలంగాణ ఆవశ్యకత గుర్తించిన మాదిరిగానే ఎస్సీ వర్గీకరణ ఆమోదించారన్నారు. దళితుల్లో వెనుక బడిన వారి సంక్షేమ కోసం ఎస్సీ వర్గీకరణ బిల్లును పార్లమెంట్ బిల్లు ఆమోదించాలని కోరారు.