- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వారి నిర్ణయమే ఫైనల్
దిశ, పటాన్ చెరు: బల్దియా ఎన్నికలకు కార్యకర్తలు సిద్ధం కావాలని, గత ఐదేళ్ల కాలంలో డివిజన్ల అభివృద్ధికి చేపట్టిన పనుల వివరాలను ప్రతి గడపగడపకు వివరించాలని మెదక్ ఎమ్మెల్సీ వెన్నవరం భూపాల్ రెడ్డి, పటాన్‌చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిలు పిలుపునిచ్చారు. ఆదివారం రామచంద్రాపురం పట్టణ పరిధిలోని రామచంద్రాపురం, భారతీనగర్ డివిజన్ల టీఆర్ఎస్ పార్టీ ముఖ్య కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సమావేశానికి హాజరైన ఎమ్మెల్సీ, ఎమ్మెల్యే మాట్లాడుతూ..
జీహెచ్ఎంసీ ఎన్నికల నోటిఫికేషన్ త్వరలో విడుదలయ్యే అవకాశాలు ఉన్నందున, ప్రతి కార్యకర్త సైనికుల వలె కృషిచేసి పార్టీ నిర్ణయించిన అభ్యర్థుల విజయానికి కృషి చేయాలని కోరారు. డివిజన్ల పరిధిలో చేపట్టిన అభివృద్ధి పనుల వివరాలను, సంక్షేమ పథకాలను ప్రతిఒక్కరికీ వివరించి అభ్యర్థుల విజయంలో కీలక పాత్ర పోషించాలని తెలిపారు. అభ్యర్థుల ఎంపిక పూర్తిగా పారదర్శకతతో జరుగుతుందని, సర్వేలు, నివేదికల ఆధారంగా, అందరి సమక్షంలో అధిష్టానం అభ్యర్థిని ప్రకటిస్తుందని, వారి నిర్ణయమే ఫైనల్ అని ఈ సందర్భంగా వారు తెలిపారు.