కిషన్‌రెడ్డిని అరెస్టు చేయాలి: రాంచందర్‌రావు

by Shyam |   ( Updated:2020-05-22 08:53:02.0  )
కిషన్‌రెడ్డిని అరెస్టు చేయాలి: రాంచందర్‌రావు
X

దిశ, న్యూస్ బ్యూరో: దళితులకు న్యాయం చేయకపోతే ప్రగతి భవన్ ముట్టడిస్తామని ఎమ్మెల్సీ రాంచందర్‌రావు హెచ్చరించారు. దళిత మహిళపై కుల వివక్షత చూపిన ఎమ్మెల్యే మంచిరెడ్డి కిషన్‌రెడ్డిని అరెస్టు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. గురువారం దళిత మహిళపై జరిగిన దాడిని నిరసిస్తూ శుక్రవారం ఎస్సీ మోర్చా ఆధ్వర్యంలో హైదరాబాద్‌లో బషీర్‌బాగ్ ప్రాంతంలోని డా. బి.ఆర్ అంబేద్కర్ విగ్రహం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రాంచందర్‌రావు మాట్లాడారు. యాచారం మండల ఎంపీపీ సుకన్య బాషపై దాడికి పాల్పడిన వారి పై చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో దళితుల పై జరుగుతున్న దాడులను కేసీఆర్ అరికట్టడంలో విఫలమయ్యారన్నారు. ఈ కేసులో నిర్లక్ష్యం చేస్తే ప్రగతి భవన్ ముట్టడిచడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ మోర్చా జాతీయ కార్యదర్శి బంగారు శృతి, రాష్ట్ర అధ్యక్షులు వేముల ఆశోక్, వడ్డేటి దేవేందర్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed