- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
బతుకమ్మ స్పూర్తితో కరోనాను ఎదుర్కొందాం
దిశ ప్రతినిధి, నిజామాబాద్: బతుకమ్మ పండుగ స్పూర్తితో మనమందరం ఉమ్మడిగా కరోనాను ఎదుర్కొందామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత పిలుపునిచ్చారు. రాష్ట్ర ప్రజలందరికీ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత ట్విట్టర్ ద్వారా బతుకమ్మ పండుగ శుభాకాంక్షలను తెలిపారు.
తెలంగాణ సంస్కృతీ సంప్రదాయాలకు ప్రతీక బతుకమ్మ పండుగ. తీరొక్క పూలతో బతుకమ్మను తీర్చిదిద్ది, ఇంటిల్లిపాదీ సంబరంగా జరుపుకునే ప్రకృతి పండుగ ఇది. రకరకాల పువ్వులతో ఈ తొమ్మిది రోజుల పాటు ముస్తాబయ్యే బతుకమ్మ సాక్షాత్తు అమ్మవారి స్వరూపమే అని ఎమ్మెల్సీ కవిత పేర్కోన్నారు. వందేళ్ల నుంచి మన ఆడబిడ్డలు ఘనంగా జరుపుకుంటున్న బతుకమ్మ పండుగను తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన నాటి నుంచి ఓ వేడుకగా టీఆర్ఎస్ ప్రభుత్వం నిర్వహిస్తోందని తెలిపారు. ఒక అన్నగా, ఒక కొడుకుగా, రాష్ట్రంలోని ప్రతి ఆడపడుచుకు ఈ పండుగ వేళ చీర రూపంలో చిరుకానుకను సీఎం కేసీఆర్ అందిస్తున్నారన్నారు. కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో ఈ ఏడాది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో భారీ ఎత్తున బతుకమ్మ కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పుకొచ్చారు. కరోనా కారణంగా అన్ని జాగ్రత్తలు తీసుకుంటూ సురక్షితంగా, సంతోషంగా బతుకమ్మ పండుగను జరుపుకోవాలని.. ఒకే చోట ఎక్కువ మంది గుమ్మిగూడవద్దంటూ కవిత ట్వీట్ చేశారు.
మన తెలంగాణ సాంస్కృతిక వారసత్వానికి ప్రతీక, ఆడబిడ్డల ఆనందాల హరివిల్లు బతుకమ్మ పండుగ సందర్భంగా..
ఆడబిడ్డలందరికీ ఎంగిలి పూల బతుకమ్మ శుభాకాంక్షలు#MyBathukammaMyPride pic.twitter.com/FUdjZNecBt— Kavitha Kalvakuntla (@RaoKavitha) October 16, 2020