- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మంత్రి హరీష్ రావును కవిత ఏం కోరిందో తెలుసా..?
దిశ ప్రతినిధి, నిజామాబాద్: దేశంలో అనేక రాష్ట్రాలు జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లో ఉంటే, మన రాష్ట్రంలో జీతాలు సమయానికి ఇవ్వడమే కాకుండా, పీఆర్సీ పెట్టి ఉద్యోగుల జీతాలు పెంచుతున్నామని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. సోమవారం శాసనమండలిలో ఆమె మాట్లాడుతూ పారదర్శకమైన, ప్రగతిశీలమైన, ప్రతిభావంతమైన సీఎం కేసీఆర్ పాలనతోనే రాష్ట్రంలో ఇవన్నీ జరుగుతున్నాయనడంలో ఎలాంటి సందేహం లేదన్నారు. రాష్ట్రంలో కొత్త పాలసీలు తెచ్చి, అభివృద్ధి కోసం ప్రయత్నం చేస్తున్నప్పటికీ , కేంద్ర ప్రభుత్వం నుంచి సహకారం రావడం లేదని విమర్శించారు. రాష్ట్రానికి పన్నుల్లో రావాల్సిన వాటా కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నదా లేదా? ఫైనాన్స్ కమీషన్ నుంచి రావాల్సిన సహకారం లభిస్తున్నదా లేదా?.. జీఎస్టీ నుంచి మనకు రావాల్సిన వాటాపై గతంలో పార్లమెంటులోనూ గుర్తు చేసినా ప్రయోజనం లేదన్నారు. రాష్ట్రానికి ఇవ్వాల్సిన వాటాను పెండింగ్‌లో పెట్టడంతోనే తెలంగాణ పురోగతికి ఆటంకాలు కలుగుతున్నాయని.. దీని గురించి వివరించాల్సిందిగా ఆర్థిక మంత్రి హరీష్ రావుని ఎమ్మెల్సీ కవిత కోరారు.